Begin typing your search above and press return to search.

200కోట్ల క్ల‌బ్ హీరో.. 300 హీరోతో పోలిక‌!!

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:30 AM GMT
200కోట్ల క్ల‌బ్ హీరో.. 300 హీరోతో పోలిక‌!!
X
బాహుబ‌లి 2- హిందీ వెర్ష‌న్‌ ఫుల్ ర‌న్ వ‌సూళ్ల రికార్డును అధిగ‌మించిన లేటెస్ట్‌ మూవీ `ఊరి: ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్`. ఈ సినిమా సాధించిన విక్ట‌రీ గురించి ఎంత మాట్లాడినా త‌క్కువే. రిలీజైన‌ 25 వ రోజు బాహుబ‌లి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ శుక్ర‌వారంతో ఈ సినిమా 200కోట్ల క్ల‌బ్ లో చేరింది. 2019లో 200 కోట్లు వ‌సూలు చేసిన తొలి సినిమాగా `ఊరి` రికార్డుల‌కెక్కింది. అయితే ఈ సినిమా సాధిస్తున్న రికార్డుల గురించి - ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు గురించి కంటే ఇందులో న‌టించిన యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ గురించి కచ్ఛితంగా మాట్లాడుకుని తీరాలి.

రూపురేఖ‌లు - న‌ట‌న‌ - ఆహార్యం ఇలా అన్ని విభాగాల్లో ఏ ఇత‌ర బాలీవుడ్ హీరోతో పోల్చినా విక్కీ కౌశ‌ల్ చాలా డిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాడు. పైగా సౌత్ కి సూట‌బుల్ అనిపించే లుక్ అత‌డికి ఉంది. వీటికి తోడు 300 హీరో జెరార్డ్ జేమ్స్ బ‌ట్ల‌ర్ ని పోలి క‌నిపిస్తున్నాడు. అత‌డి ముఖాకృతి - ఆహార్యం - శ‌రీర దారుఢ్యం ప్ర‌తిదీ సేమ్ టు సేమ్ 300 హీరోని పోలి క‌నిపిస్తున్నాడు. ఊరిలో విక్కీ కౌశ‌ల్ గ‌డ్డం లుక్ అచ్చం బ‌ట్ల‌ర్ నే త‌ల‌పించింది. ఇక ఆ సినిమాలో ఆర్మీ అధికారిగా వార్ స‌న్నివేశాల్లో విక్కీ ఆహార్యం సైతం అచ్చం బ‌ట్ల‌ర్ త‌ర‌హా లో క‌నిపించ‌డం ఓ హైలైట్.

ఈ యంగ్ హీరోకి బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అతి పెద్ద కెరీర్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికిప్పుడు క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కిస్తున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `త‌క్త్` లో అత‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. విక్కీ కౌశ‌ల్ ఇదివ‌ర‌కూ కియ‌రా అద్వానీ న‌టించిన `ల‌స్ట్ స్టోరీస్`లోనూ ఓ ముఖ్య‌ పాత్ర‌లో క‌నిపించాడు. ఆ త‌ర్వాత తాప్సీతో క‌లిసి `మ‌న్మార్జియాన్` చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించాడు. తాజాగా ఊరి చిత్రంతో రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొట్టాడు. త‌ర్వాత ఓ హార‌ర్ చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఇక‌పోతే ఈ యంగ్ హీరో లుక్ సౌత్ సినిమాకి పెర్ఫెక్ట్ యాప్ట్ కాబ‌ట్టి మునుముందు అత‌డికి టాలీవుడ్ నుంచి మ‌ల్టీస్టార‌ర్ల‌లో ఆఫ‌ర్లు వ‌రించే ఛాన్సుంటుంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించే మ‌ల్టీస్టార‌ర్ల‌కు విక్కీ లాంటి హీరో ప్ల‌స్ అవుతాడ‌న‌డంలో సందేహ‌మే లేదు.