Begin typing your search above and press return to search.

బన్నీతో ఆ డైరెక్టర్ స్టోరీ సిటింగ్స్

By:  Tupaki Desk   |   31 Oct 2017 5:11 PM GMT
బన్నీతో ఆ డైరెక్టర్ స్టోరీ సిటింగ్స్
X
అల్లు అర్జున్ ఓ కుర్ర డైరెక్టర్ తో సినిమా చేయడం సాధ్యమవుతుందా? గతంలో అయితే ఇందుకు నో అనే సమాధానమే వినిపించేది. సీనియర్ దర్శకులతో వరుసగా సినిమాలు చేసిన బన్నీ.. ప్రస్తుతం కొత్త యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు ఏ మాత్రం అభ్యంతరపెట్టడం లేదు.

ప్రస్తుతం నటిస్తున్న నా పేరు సూర్య చిత్రం ద్వారా రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా ప్రమోట్ అవుతున్నాడు. ఇదే జోరులో తన నెక్ట్స్ మూవీ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడట అల్లు అర్జున్. రీసెంట్ గా దర్శకుడు వీఐ ఆనంద్.. స్టైలిష్ స్టార్ ను కలిసి కథ వినిపించాడనే ప్రచారం జోరుగానే సాగుతోంది. గతేడాది ఎక్కడకు పోతావు చిన్నవాడా మూవీతో పెద్ద సెన్సేషన్ నే నమోదు చేసుకున్నాడు ఈ డైరెక్టర్. డీమానిటైజేషన్ సమయంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం కూడా మెగా క్యాంప్ తోనే వర్క్ చేస్తున్నాడు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇదే సమయంలో బన్నీ కోసం ఓ లైన్ వినిపించాడట. అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపించి.. పూర్తి కథ రాసుకురమ్మన్నాడని అంటున్నారు. ఒకవేళ అల్లు శిరీష్ మూవీతో మెప్పించి సక్సెస్ ను కంటిన్యూ చేస్తే మాత్రం.. వీఐ ఆనంద్ కు బన్నీ లాంటి స్టార్ హీరోతో పని చేసే ఛాన్స్ వచ్చి వాలినట్లే అనే టాక్ వినిపిస్తోంది.