Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారిన మెగాస్టార్ న్యూ లుక్‌

By:  Tupaki Desk   |   29 April 2022 7:37 PM IST
వైర‌ల్ గా మారిన మెగాస్టార్ న్యూ లుక్‌
X
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత `ఆచార్య‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? ఎప్పుడెప్పుడు చిరుని వెండితెర‌పై చిరుని చూడాలా? అని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయితే ఎట్ట‌కేల‌కు వారి ఎదురుచూపుల‌కు తెర‌ప‌డింది. మెగాస్టార్ న‌టించిన `ఆచార్యా` ఏప్రిల్ 29న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేసింది. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం తో మెగా ఫ్యాన్స్ కి `ఆచార్య‌` డ‌బుల్ బొనాంజ‌గా మారింది.

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే సినిమా ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. స్వ‌యంగా అభిమానులే `ఆచార్య‌` మూవీ ఆశించిన స్థాయిలో లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తొలి రోజే మిశ్ర‌మ స్పంద‌న‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిరు కార‌ణంగా వైర‌ల్ గా మారింది. దాదాపు రెండేళ్లుగా ఎదురుచూసిన ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది.

సినిమాలోని ఓ కీల‌క ఘ‌ట్టంలో మెగాస్టార్ యంగ్ క్యారెక్టర్ క‌నిపించే స‌న్నివేశం ఒక‌టి వుంది. ఇందు కోసం చిరుని వీఎఫ్ ఎక్స్ స‌హాయంతో 30 ఏళ్లు త‌గ్గించి యువ‌కుడిగా చూపించారు. 80వ ద‌శ‌కంలో చిరు లుక్ ఎలా వుండేదో సేటు సేమ్ డిటో అదే లుక్ లోకి చిరుని వీఎఫ్ ఎక్స్ ద్వారా మార్చేసి వెండితెర‌పై చూపించ‌డంతో ఫ్యాన్సే కాకుండా స‌గ‌టు సినీ ప్రియులు కూడా చిరుని స‌రికొత్త అవ‌తారంలో చూసి స‌ర్ ప్రైజ్ అయ్యారు. థియేట‌ర్లో సినిమా చూసిన కొంత మంది ప్రేక్ష‌కులు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే ఈ స్టిల్ పై ఫ్యాన్స్ త‌లో విధంగా స్పందిస్తున్నారు. మేక‌ర్స్ ఈ స‌న్నివేశంలో వీఎఫ్ ఎక్స్ ని వాడ‌కుండా వుంటే బాగుండేద‌ని కొంత మంది, కొంత మందేమో ఆశించిన స్టాండ‌ర్డ్స్ లో వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ లేద‌ని కామెంట్ లు చేస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో సోనుసూద్‌, జిష్సూ సేన్ గుప్తా, అజ‌య్‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, సౌర‌వ్ లోకేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్.. అతిథి పాత్ర‌లో స‌త్య‌దేవ్ న‌టించారు.