Begin typing your search above and press return to search.

జక్కన్న సినిమా రేంజ్ లో 'హరి హర వీరమల్లు' కోసం 6 నెలలు

By:  Tupaki Desk   |   13 March 2021 3:23 AM GMT
జక్కన్న సినిమా రేంజ్ లో హరి హర వీరమల్లు కోసం 6 నెలలు
X
పవన్ కళ్యాణ్‌ మొదటి సారి ఛారిత్రాత్మక నేపథ్యంలో నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మహా శివ రాత్రి సందర్బంగా విడుదల అయిన ఫస్ట్‌ లుక్ మరియు గ్లింప్స్ సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చాయి. భారీ ఛారిత్రాత్మక సినిమా అవ్వడంతో సినిమా కు భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్‌ వర్క్‌ చేయించాల్సి ఉంటుందట. క్రిష్ ఈ సినిమా షూటింగ్‌ ను మరో మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయిన ఆరు నెలలకు పైగా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుని ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

ఆరు నెలల పాటు గ్రాఫిక్స్ వర్క్ అంటే ఏ రేంజ్ లో సినిమాలో విజుల్‌ ఎఫెక్ట్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి మాత్రమే ఇలా విజువల్ ఎఫెక్ట్స్‌ కోసం అంత సమయంను తీసుకుంటూ ఉంటాడు. విజువల్ ఎఫెక్ట్స్ ను రాజమౌళి తరహాలో భారీ ఎత్తున ఖర్చు చేసి క్రిష్‌ చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. 150 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. బడ్జెట్‌ లో మెజార్టీ మొత్తంను విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్‌ ఈ సినిమా షూటింగ్ ను ముగించిన వెంటనే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.