Begin typing your search above and press return to search.

భయపడే డైరెక్టర్ ను కాదంటున్న శివాజీరాజా తనయుడు..!

By:  Tupaki Desk   |   5 Sept 2020 12:30 PM IST
భయపడే డైరెక్టర్ ను కాదంటున్న శివాజీరాజా తనయుడు..!
X
ప్రముఖ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటిస్తున్న చిత్రం 'వేయి శుభములు కలుగు నీకు'. తమన్నా వ్యాస్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జయ దుర్గాదేవి మల్టీ మీడియా బ్యానర్ పై తూము నరసింహ పటేల్ నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ను సీనియర్ కమెడియన్, హీరో సునీల్ విడుదల చేశాడు.

కాగా టీజర్ లో ''ప్రతి ఒక్కడి లైఫ్ లో రెండు టార్గెట్స్ ఉంటాయి. ఒకటి ఇల్లు రెండోది పెళ్లి. ఆ టార్గెట్స్ నాకూ ఉన్నాయి'' ''భయపడే డైరెక్టర్ ను కాదురా.. భయపెట్టే డైరెక్టర్'' అని విజయ్‌ రాజా పలికిన డైలాగ్స్ చూస్తుంటే దీన్నో ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివాజీరాజా కూడా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ.. 'సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో నాగశౌర్యకు.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన నానికి.. ఇప్పుడు టీజర్ విడుదల చేసిన సునీల్‌ కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించినట్టే నా కొడుకుని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.