Begin typing your search above and press return to search.

చెన్నైలో వెట‌ర‌న్స్ గెట్ టు గెద‌ర్ పార్టీ

By:  Tupaki Desk   |   19 Feb 2022 3:46 PM GMT
చెన్నైలో వెట‌ర‌న్స్ గెట్ టు గెద‌ర్ పార్టీ
X
స‌మ‌యం చిక్కిన ప్రతీ ఏడాది 80`s హీరోలు, హీరోయిన్  లు ప్ర‌త్యేకంగా ఒక చోట చేరి రీ యూనియ‌న్ పార్టీ పేరుతో ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇలా చేసుకున్న పార్టీల‌కు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటున్నారు కూడా.

అవి నెట్టింట వైర‌ల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా త‌మిళ‌, మ‌ల‌యాళ పాపుల‌ర్ వెట‌రన్ హీరోయిన్‌లు , హీరోలు ప్ర‌త్యేకంగా క‌లిసి చెన్నైలో గెట్ టు గెద‌ర్ పార్టీ చేసుకున్నారు. ఓ రేంజ్ లో హంగామా చేశారు.

శుక్ర‌వారం రాత్రి వీకెండ్ కావ‌డంతో చెన్నైలో ర‌మ్య‌కృష్ణ - ఖుష్బూ - రాధిక శ‌ర‌త్ కుమార్ - బోనీ క‌పూర్ - శోభ‌న - సుమ‌ల‌త - ప్ర‌భు -లీజీ   క‌లిసి శుక్ర‌వారం రాత్రి వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని హీరోయిన్ త్రిష త‌న ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. త‌ను కూడా ఈ పార్టీలో పాల్గొని సీనియ‌ర్ హీరోయిన్ ల‌తో క‌లిసి పార్టీని ఎంజాయ్ చేసింది.

పార్టీలో పాల్గొన్న తార‌లంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చారు. ప్ర‌స్తుతం త్రిష షేర్ చేసిన ఫ్రైడే నైట్ వీకెండ్ పార్టీ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఈ ఫొటోల‌కు ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. లేట్ నైట్ పార్టీ అంటూ షేర్ చేసింది. తొలి సారి ఇలా వెట‌ర‌న్ స్టార్ లంతా చెన్నైలో వీకెండ్ పార్టీలో హంగామా చేయ‌డం విశేషం.

బోనీక‌పూర్ నిర్మించిన త‌మిళ చిత్రం `వ‌లీమై`. అజిత్ హీరోగా న‌టించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ నెల 24న విడుద‌ల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మూవీ రిలీజ్ ప‌నుల్లో బిజీగా వున్న బోనీ క‌పూర్ చెన్నై కి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్రైడే నైట్ జ‌రిగిన పార్టీలో పాల్గొన్నారు. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ న‌టించిన ఈ చిత్రంలో విల‌న్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మ‌కొండ న‌టించారు.