Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో రాలిన మరో సినీ శిఖరం

By:  Tupaki Desk   |   31 July 2018 10:57 AM IST
టాలీవుడ్ లో రాలిన మరో సినీ శిఖరం
X
టాలీవుడ్ లో మరో విషాధం నెలకొది. ప్రముఖ సినీ నిర్మాత కోటపల్లి రాఘవ మృతిచెందారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మంగళవారం గుండెపోటుతో మృత్యువాతపడ్డారు. ఈయన వయసు 105 ఏళ్లు. 1913 డిసెంబర్ 9న తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి గ్రామంలో జన్మించారు.

రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై 30కి పైగా సినిమాలు తీశారు. తరంగణి, తూర్పు పడమర లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. 1972లో తాతామనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు ఉత్తమ నిర్మాతగా నంది అవార్డులు అందుకున్నారు.

1931లో తెలుగు సినిమా నిర్మాణం జరుపుకోగా.. అంతకుముందే ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు. కోల్ కతా లో సినిమ షూటింగ్ లో ట్రాలీ పుల్లర్ గా చేసి అంచెలంచెలుగా సినిమా నిర్మాతగా ఎదిగారు.

సినీ దిగ్గజాలైన దాసరి - రావుగోపాల్ రావు - కోడి రామకృష్ణ - గొల్లపూడి మారుతీరావు - ఎస్పీ బాలు - సుమన్ - భాను చందర్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రాఘవనే.. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.