Begin typing your search above and press return to search.
నటి సురేఖ హఠాన్మరణం
By: Tupaki Desk | 7 Jun 2021 11:45 AM ISTప్రముఖ కన్నడ నటి సురేఖ మృతిచెందారు. ఆదివారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తుండగా.. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించినప్పటికీ.. ఉపయోగం లేకపోయింది. కాసేపటికే ఆమె మృతిచెందినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సురేఖ వయసు 66 సంవత్సరాలు. ఆమె మృతిచెందడం పట్ల శాండల్ వుడ్ కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు ఆమె స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. సురేఖ అంతిమ సంస్కారాలను ఆదివారమే నిర్వహించారు. బెంగళూరులోని బనశంకరి శ్మశాన వాటికలో ఖననం చేశారు.
కాగా.. తన సినీ కెరీర్లో 160కిపైగా చిత్రాల్లో నటించిన సురేఖ.. ఎంతో మంది స్టార్ల సరసన ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో కలిసి త్రిమూర్తి, ఒలావు గెలువు, గిరి కాన్యే, సాక్షత్క వంటి చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా.. భరతనాట్య కళాకారిణిగా అలరించారు సురేఖ.
తన నాట్య ప్రతిభతో దేశ, విదేశాల్లో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. విదేశాల్లో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లో టాప్ స్టార్ గా నిలిచిన సురేఖ.. అన్నీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించారు. ఉన్నట్టుండి అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తూ వెళ్లిపోయారు.