Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్ లో వెటరన్ క్లాసికల్ డాన్సర్ శోభన
By: Tupaki Desk | 27 Sept 2021 5:00 PM ISTచిలుకా క్షేమమా.. కులుకా కుశలమా? తెలుపుమా.. ! సఖుడా సైఖ్యమా? సరసం సత్యమా? ... రౌడీ అల్లుడు సినిమాలోని పాట ఇది. మెగాస్టార్ చిరంజీవి- శోభన- దివ్యభారతి కాంబినేసన్ లో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రంలో ఈ పాటలో శోభనతో చిరు స్టెప్పుల్ని నాటి యూత్ నేటి సీనియర్లు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బప్పీలహరి మ్యూజిక్ .. ఎస్పీబీ గానం గుర్తుంది ఇంకా. చిరు సరసన పలు చిత్రాల్లో నటించిన శోభన.. ఇప్పుడు మరోసారి ఆయన కోసం దిగి వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మలయాళం సినిమా` లూసీఫర్` తెలుగు రీమేక్ తో ఇది సాధ్యమవుతోంది. ఈ చిత్రం `గాడ్ ఫాదర్` టైటిల్ తో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మాతృకలో ఈ సినిమా భారీ విజయం సాధించడం..టాలీవుడ్ లో ఆ చిత్రాన్ని మెగాస్టార్ రీమేక్ వెర్షన్ లో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కేవలం తెలుగులోనే చిత్రం తెరకెక్కుతున్నప్పటికి స్క్రిప్ట్ డిమాండ్ మేరకు టాప్ స్టార్లను రంగంలోకి దించుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.
మెగాస్టార్ తో సల్మాన్ కు ఉన్న ప్రెండ్ షిప్ కారణంగా భాయ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా సముద్ర ఖని.. బిజుమీనన్..జగపతి బాబు లాంటి నటులు సైతం `గాడ్ ఫాదర్` లో భాగమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నటిని మోహన్ రాజా సీన్ లోకి తీసుకొచ్చారు. వెటనర్ నటి శోభన ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుందని సమాచారం. ఆ పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందని టాక్. అదే గనుక నిజమైతే శోభక పోషించే పాత్ర మాతృకలో మంజు వారియర్ పోషించిన పాత్ర అయి ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్ ఆ రోల్ లో చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అందుకే శోభన లాంటి సీనియర్ నటిని రంగంలోకి దించుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే శ్రియ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరోవైపు ప్రచారంలో ఉంది. ఆ పాత్ర ఏంటన్నది తెలియదు గానీ శ్రియ కూడా సినిమాలో భాగమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో చిరంజీవి పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని యూనిట్ ధీమాను వ్యక్తం చేసింది. బాస్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-సూపర్ గుడ్ ఫిల్మ్స్ -ఎన్వీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.