Begin typing your search above and press return to search.

ఆ సోయగాల కళ్ల మత్తులో సోలిపోతున్న కుర్రాళ్ళు!

By:  Tupaki Desk   |   16 Jun 2020 10:50 AM GMT
ఆ సోయగాల కళ్ల మత్తులో సోలిపోతున్న కుర్రాళ్ళు!
X
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మధురిమ అంతగా గుర్తుండక పోవచ్చు. ఎందుకంటే అమ్మడు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. అల్లరి నరేష్ నటించిన 'సరదాగా కాసేపు' సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఇంకా చెప్పాలంటే కొత్తజంట సినిమాలోని 'అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం' ఐటమ్ పాటలో చిందేసింది. ఆ పాటతో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన ఈ భామ.. 'ఆ ఒక్కడు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే అమ్మడు చేసిన సినిమాలు టాక్ పరంగా బాగానే ఉన్నా తనకు మాత్రం ఎలాంటి గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో మధురిమ బాలీవుడ్ వైపు అడుగులేసింది. సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువనే సంగతి తెలిసిందే. పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని.. లేదా పేరులో ఏదైనా అక్షరం మార్చుకుంటే బ్రేక్ వస్తుందని గుడ్డిగా నమ్ముతుంటారు. కెరీర్ డీలా పడినపుడల్లా ఇలా ఆలోచిస్తారు. ఇటీవల మధురిమ పరిస్థితి కూడా అలాగే మారింది.

పలు తెలుగు సినిమాలు చేసినా కెరీర్లో ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్ళగానే తన పేరు మదురిమను కాస్త నైనా బెనర్జీగా మార్చుకుంది. బాలీవుడ్‌లో 'వన్ నైట్ స్టాండ్' అనే అడల్ట్ కంటెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చి అందాల ఆరబోత బాగానే చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మధురిమగా ఉన్న తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుందట అమ్మడు. టాలీవుడ్లో బ్రేక్ రాలేదని కన్నడ - మలయాళ సినిమాలలో చాలానే ప్రయత్నాలు చేసింది. సినిమాలలో అడపాదడపా కనిపించే మధురిమ.. కుర్రకారుకి కిర్రెక్కించే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఇక అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అమ్మడిని చూస్తే కాస్త ట్రెండీగా అనిపించవచ్చు.. కానీ కళ్ళతో మాత్రం మత్తెక్కించే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో అమ్మడి ముఖారవిందం రెట్టింపు అయిందని చెప్పాలి. టి షర్ట్ వేసుకొని కాస్త ఆ సోయగాల విందు వడ్డించేస్తుంది. ఇక ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న మధురిమ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది.