Begin typing your search above and press return to search.
వర్సటైల్ యాక్టర్ డెడికేషన్ లెవల్ ని మెచ్చుకోవాల్సిందే..!
By: Tupaki Desk | 1 Jun 2021 2:00 PM ISTమలయాళ వర్సటైల్ యాక్టర్ టొవినో థామస్ తెలుగు ఓటీటీ 'ఆహా' కారణంగా మన ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. టొవినో నటించిన పలు సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా యాప్ లో స్ట్రీమింగ్ పెట్టగా విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. 'ఫోరెన్సిక్' 'మాయానది' 'లూకా అలియాస్ జానీ' 'వ్యూహం' 'అండ్ ది ఆస్కార్ గోస్ టూ' వంటి వైవిధ్యమైన సినిమాలు టొవినో థామస్ ని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేశాయి. ఈ క్రమంలో ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ''కాలా'' ను ఆహా ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు రోహిత్ వి. ఎస్ ''కాలా'' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే రివేంజ్ డ్రామానే ఈ సినిమా. హీరో టొవినో థామస్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతున్న సమయంలో టోవినో థామస్ ప్రమాదానికి గురైయ్యాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితితో హాస్పిటల్ లో చేసిన టాలెంటెడ్ హీరో.. వారం తర్వాత కొలుకున్నాడు. వెంటనే తిరిగి చిత్రీకరణలో పాల్గొని మిగతా సినిమాని పూర్తి చేసాడంటే టోవినో డెడికేషన్ లెవల్ ని మెచ్చుకొని తీరాలంతే.
మలయాళంలో ఘన విజయం సాధించిన 'కాలా' చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి 'ఆహా' ఓటీటీలో జూన్ 4న స్ట్రీమింగ్ చేస్తున్నారు. మనిషిలోని మృగం మేల్కొన్నప్పుడు నాగరికత చిన్నబోతుందనే కాన్సెప్ట్ తో మనుషులు - జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని రియలిస్టిక్ యాక్షన్ కలబోసి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో సుమేష్ మూర్ - లాల్ - దివ్య పిళ్ళై ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.