Begin typing your search above and press return to search.

హవీష్ తో వెరైటీ లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   29 May 2019 10:32 AM GMT
హవీష్ తో వెరైటీ లవ్ స్టోరీ
X
యాంకర్ ఓంకార్ తీసిన జీనియస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయిన హవీష్ హీరోగా కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యింది. శశిధర్ అనే డెబ్యు దర్శకుడితో అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే దీనికి ఇంకో విశేషం ఉంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ అధినేత అభిషేక్ నామా దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా నిర్వహించిన కాంటెస్ట్ లో శశిధర్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాని ఆధారంగా ఇతనిలో టాలెంట్ ఉందని గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు.

రొమాంటిక్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ ఎమోషనల్ మూవీ ద్వారా ఖచ్చితంగా ఆకట్టుకోగలను అనే నమ్మకాన్ని శశిధర్ వ్యక్తం చేస్తున్నాడు. సుకుమార్ చేతుల మీదుగానే ఇది పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఈ శశిధర్ గతంలో లడ్డు-నన్ను క్షమించు లాంటి లఘు చిత్రాల ద్వారా నంది అవార్డులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ఈ ఛాన్స్ వచ్చిందిహీరో హవీష్ కూడా దీని మీద గట్టి నమ్మకం వ్యక్తం చేశాడు. ఇతని లేటెస్ట్ థ్రిల్లర్ సెవెన్ వచ్చే వారం విడుదల కానుంది.

ఇప్పుడు ప్రారంభమైన సినిమా కూడా డిఫరెంట్ జానర్ లో అలరిస్తుందని చెబుతున్నాడు. ఆరెక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న సాయి శ్రీరాం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మిగిలిన తారాగణం టెక్నికల్ టీం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 14 ఏళ్ళు పరిశ్రమలో ఉంటూ తన కలను నెరవేర్చుకున్న శశిధర్ మీద సుకుమార్ కు సైతం మంచి గురి ఉంది. కాంబో పరంగా మంచి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది