Begin typing your search above and press return to search.

అంతా దిల్ రాజు మహిమ

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:16 PM GMT
అంతా దిల్ రాజు మహిమ
X
ఒకప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎక్కువగా కొత్త దర్శకులే సినిమాలను తెరకెక్కిస్తుండే వారు. దిల్ రాజు కూడా వారి టాలెంట్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చేవారు. అయితే ఆయన ప్రొడక్షన్ లో మొదటి సినిమా హిట్ అయితే దర్శకులకు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చేవాడు. అప్పట్లో ఆ ఫార్మాట్ చాలానే కనిపించేది. బోమ్మరిల్లు - పరుగు సినిమాలను తెరకెక్కించిన భాస్కర్ అలాగే శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇలా దర్శకులు మొదటి రెండు హిట్స్ దిల్ రాజు ప్రొడక్షన్ లో అందుకునేవారు.

అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు నమ్మకాన్ని కొంత మంది ప్లాప్ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారు. జోష్ సినిమాతో పరిచయం అయిన వాసువర్మ ప్లాప్ ఇచ్చినా కూడా దిల్ రాజు అతన్ని నమ్మి కృష్ణాష్టమి అనే సినిమాను నిర్మించాడు. కానీ ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఇక రీసెంట్ గా ఎంసీఏ ను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ కూడా అదే దారిలో నడిచాడు. మొదట ఈ దర్శకుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ మై ఫ్రెండ్ సినిమాని చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఎంసీఏ మాత్రం ఎలాగో దిల్ రాజు మ్యాజిక్ చేసి ఆడింది అన్నట్లుగా నడిపించేశాడు. కానీ సినిమా మాత్రం ఫైనల్ గా ఫెయిల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఎంసీఏ దర్శకుడు ప్లాప్ ఇచ్చినా కూడా మరో అవకాశాన్ని అందుకునే ఛాన్స్ ఉందట. త్వరలో రవితేజ తో ఒక సినిమా చేస్తాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలైతే కొన్నేళ్ల క్రితమే ఓ సినిమాను చేద్దామని అనుకున్నాడట. కానీ సినిమా స్టార్ట్ కాకముందే ఆగిపోయిందట. మరి మూడవసారి ఈ దర్శకుడు ఎలాంటి సినిమాను చేస్తాడో చూడాలి.