Begin typing your search above and press return to search.

బన్నీ సినిమా అప్‌ డేట్‌ ఇచ్చిన పవన్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   21 March 2021 11:30 PM GMT
బన్నీ సినిమా అప్‌ డేట్‌ ఇచ్చిన పవన్‌ డైరెక్టర్‌
X
పవన్‌ కళ్యాణ్‌ తో 'వకీల్‌ సాబ్‌' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్‌ 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ తో చేయబోతున్న సినిమా గురించి దర్శకుడు వేణు శ్రీరామ్‌ క్లారిటీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా దాదాపు మూడేళ్ల క్రితం 'ఐకాన్‌' సినిమా ను ప్రకటించారు. ఆ సినిమా ను పక్కన పెట్టి బన్నీ ఇతర సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వకీల్ సాబ్‌ ప్రమోషన్ సందర్బంగా ఆ విషయమై స్పష్టతను దర్శకుడు ఇచ్చాడు.

బన్నీతో తాను చేయాల్సిన ఐకాన్‌ సినిమాను వాయిదా మాత్రమే వేశామని క్లారిటీ ఇచ్చాడు. బన్నీ ప్రస్తుతం కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఐకాన్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బన్నీతో సినిమా తప్పకుండా ఉంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్‌ చెప్పాడు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న బన్నీ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పూర్తి అయితే అప్పుడు వేణు శ్రీరామ్ కు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందబోతుంది.

--