Begin typing your search above and press return to search.

ఇంట్ర‌స్టింగ్ః ప‌వ‌న్ కాదంటే వ‌కీల్ ‌సాబ్ ఆయ‌నే!

By:  Tupaki Desk   |   9 April 2021 9:00 AM IST
ఇంట్ర‌స్టింగ్ః ప‌వ‌న్ కాదంటే వ‌కీల్ ‌సాబ్ ఆయ‌నే!
X
మ‌రికొన్ని గంట‌ల్లో థియేటర్ల‌లో వ‌కీల్ సాబ్ ప్ర‌భంజ‌నం షురూ కాబోతోంది. వాద‌, ప్ర‌తివాద‌న‌ల‌తో సినిమా టా‌కీసులు ద‌ద్ద‌రిల్ల‌బోతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ చెప్పాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌. వ‌కీల్ సాబ్ లో న‌టించ‌డానికి ప‌వ‌న్ నో చెబితే.. తాను ఎవ‌రిని సెల‌క్ట్ చేసుకుంటాడో చెప్పి సర్ ప్రైజ్ చేశాడు.

ఈ సినిమా బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. అందులో అమితాబ్ పోషించిన పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్నారు. అయితే.. ఒరిజిన‌ల్ లో బిగ్ బి పాత్ర త‌క్కువ‌గానే ఉంటుంది. కానీ.. తెలుగులో ప‌వ‌న్ చేయాల్సి రావ‌డంతో క‌మ‌ర్షియల్ అంశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చింది.

అయితే.. మ‌హిళ‌లు ప్ర‌ధానంగా ఉండే సినిమా కాబ‌ట్టి, ఒక‌వేళ ప‌వ‌న్ ఈ సినిమాకు నో చెప్పి ఉంటే.. ఎవ‌రిని సెల‌క్ట్ చేసుకుంటారు అని అడిగిన ప్ర‌శ్న‌కు తాను నాగార్జున‌ను సెల‌క్ట్ చేసుకుంటాన‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌. ''నాగార్జున గారి లాంటి వారు ఈ చిత్రానికి ఖచ్చితంగా సరిపోతారు. ఆయనలాంటి నటుడి వ‌ల్ల సినిమా కంటెంట్‌పై దృష్టి పెట్టేలా చేస్తుంది. అంతేకాకుండా.. అద‌న‌పు అంశాల‌ను యాడ్ చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. కథ మూలంతోనే ముందుకు సాగొచ్చు'' అని వేణు శ్రీరామ్ వ్యాఖ్యానించినట్టు సమాాచారం.