Begin typing your search above and press return to search.
పవన్ అభిమానులకు డౌట్ తీర్చేసిన వేణు శ్రీరామ్
By: Tupaki Desk | 31 March 2021 9:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్` ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇది కోర్ట్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో సాగే ఎమోషనల్ ఎంటర్ టైనర్. అయితే ఒరిజినల్ సినిమా పింక్ కథను డైవర్ట్ చేస్తున్నారా? పవన్ ఇమేజ్ పేరుతో కమర్షియల్ హంగుల్ని చేర్చడంతో ఫ్లేవర్ మారిపోనుందా? అంటూ పింక్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
దానికి తాజా ఇంటర్వ్యూలో వేణుశ్రీరామ్ సరైన జవాబిచ్చారు. `పింక్` కథ `వకీల్ సాబ్` కోసం మార్చలేదు. ఆత్మ చెక్కు చెదరకుండా అదనపు హంగులు చేర్చామని వెల్లడించారు. పింక్ ప్రధాన భాగం యథాతథంగా తెరపై కనిపిస్తుంది. నేను కథనాన్ని మాత్రమే మార్చాను. వకీల్ సాబ్ కూడా కోర్టు గది డ్రామా. రెండు నిమిషాల ట్రైలర్ లో కోర్టు గది దృశ్యాలను దాదాపు ఒకటిన్నర నిమిషాలు చూపించాం`` అని వేణు శ్రీరామ్ తన మీడియా ఇంటరాక్షన్ లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త సన్నివేశాలను చేర్చాం. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ అదనంగా జోడించాం. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రతిదీ బ్యాలెన్స్ చేయాల్సొచ్చింది. ఒరిజినాలిటీ చెడకుండా పరిమితుల్లోనే ఈ మార్పులు చేశాం.. అని తెలిపారు.