Begin typing your search above and press return to search.

పుష్ప డైలాగ్ ముందే చెప్పేసిన వేణు మాధవ్

By:  Tupaki Desk   |   4 Feb 2022 3:36 AM GMT
పుష్ప డైలాగ్ ముందే చెప్పేసిన వేణు మాధవ్
X
పుష్ప సినిమాలో ప్రతి సీన్.. ప్రతి డైలాగ్.. ప్రతి పాటా.. ప్రతి స్టెప్.. సంచలనమే అని చెప్పాలి. సోషల్ మీడియాలో నెలన్నర నుంచి ఎక్కడ చూసినా ఈ సినిమాలో డైలాగులు.. పాటలు.. స్టెప్పులే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మేనరిజం డైలాగ్ అయిన తగ్గేదేలే.. ఏ లెవెల్లో పాపులర్ అయిందో తెలిసిందే. ఇక సినిమాలో ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ పాత్ర ఆరంభంలోనే తన యాటిట్యూడ్ చూపించే సీన్లో వచ్చే డైలాగ్ కూడా బాగా హైలైట్ అయింది. టింబర్ డిపోలో పని చేసి బయటికి వచ్చాక కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటాడు బన్నీ. ఓనర్ వస్తున్నా అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావేంటని అడిగితే.. ‘‘ఈ కాలు నాదే ఆ కాలు నాదే.. నా కాలు మీద నా కాలేసుకుంటే ఆయనకేంటి నొప్పి. నా కాలేమైనా ఆయన మీద వేశానా’’ అంటాడు పుష్ప.

ఈ డైలాగ్‌ నుంచే పుష్ప క్యారెక్టర్ జనాలకు బాగా ఎక్కేయడం మొదలవుతుంది. సుకుమార్ మార్కు కనిపించిన ఈ డైలాగ్‌ను చాలా ఏళ్ల కిందటే దివంగత కమెడియన్ వేణుమాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. దివంగత నటుడు, ఇంటర్వ్యూయర్ టీఎన్ఆర్ ఈ ఇంటర్వ్యూ చేశారు. మధ్యలో ఒక చోట ఆయన.. ఎవరి ముందైనా మీరు కాలు మీద కాలేసుకుని కూర్చుంటారన్న కంప్లైంట్ ఉందే అని అంటే.. దానికి వేణు మాధవ్ బదులిస్తూ.. ‘‘ఒకసారి ఓ పెద్ద హీరో నన్ను పిలిచి ఏంటయ్యా నువ్వు కాలు మీద కాలేస్తావంటనే అని అడిగారు.

ఏ నాకొడుకుసార్ చెప్పింది అనడిగాను. వెంటనే ఆయన ఫోన్ తీసి ఆ మాట ఎవరన్నారో చెబుతా అంటూ నంబర్ వెతుకుతున్నారు. అప్పుడు నేనాయన్ని సరిగ్గా చెప్పండి ఆయనేమన్నారో అంటే.. కాలు మీద కాలేసుకుని కూర్చుంటావట కదా అన్నారు. అందుకు నేను నా కాలు మీద నా కాలేసుకుంటే ఎవరికైనా ఏంటి ఇబ్బంది.. నా కాలు తీసుకెళ్లి వేరే వాళ్ల మీద వేస్తే కదా సమస్య అన్నాను. దానికాయన ఇది కరెక్ట్ కాదు అన్నారు. తర్వాత నీ ఇష్టం అని వదిలేశారు. కాలు మీద కాలేసుకోవడం మా ఫ్యామిలీలో అందరికీ ఉన్న బ్యాడ్ హ్యాబిట్. మా పిల్లలు కూడా అలాగే వేసుకుంటారు’’ అని వేణు మాధవ్ వివరణ ఇచ్చాడు. ‘పుష్ప’ సినిమాలో దాదాపుగా ఇలాగే హీరో డైలాగ్ ఉండటంత

ో వేణుమాధవే దీనికి స్ఫూర్తి అంటున్నారు నెటిజన్లు. ఐతే సినిమాలో చూపించే ఆ సన్నివేశం నిజంగా తన అన్నయ్య జీవితంలో జరిగిందని.. ఆయన చెబితేనే ఆ సీన్, డైలాగ్ పెట్టానని సుకుమార్ చెప్పడం గమనార్హం.