Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్ తొలి జీతం ఎంత‌?

By:  Tupaki Desk   |   26 Sep 2019 7:18 AM GMT
క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్ తొలి జీతం ఎంత‌?
X
హైద‌రాబాద్ లో 10 సొంత ఇండ్లు.. ప‌ల్లెటూరిలో 10 ఎక‌రాల పొలం ఉన్న స్థితిమంతుడు వేణుమాధ‌వ్ అందుకున్న తొలి పారితోషికం ఎంత‌? ఎంతో తెలిస్తే షాక్ తింటారు. అంతేనా.. తొలి జీతం అందుకున్న‌ది ఎక్క‌డ‌? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ అత‌డి మొద‌టి జీతం ఎంత‌.. ఎక్క‌డ అందుకున్నాడు? అంటే..

మొద‌టి జీతం తెలుగు దేశం పార్టీ ఆఫీస్ నుంచి అందుకున్నాడు. నాటి ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావుకు ఫోన్లు క‌నెక్ట్ చేసే ఆప‌రేట‌ర్ గా ఆఫీస్ లో ప‌ని చేశాడు. మొద‌టి జీతం 600. అయితే అప్ప‌టికే వేణుమాధ‌వ్ ప్ర‌తిభావంతుడైన మిమిక్రీ ఆర్టిస్ట్. జీతానికి ప‌ని చేసే రోజుల్లోనే మిమిక్రీ ఆర్టిస్టుగా చాలా స్టేజ్ షోలు ఇవ్వాల‌ని రియ‌లైజ్ అయ్యాడ‌ట‌. అలా ఓసారి ర‌వీంద్ర‌భార‌తిలో స్టేజ్ షో ఇచ్చేప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి చూసి `సాంప్ర‌దాయం` అనే చిత్రంలో అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌ర్వాత పాపుల‌ర్ క‌మెడియ‌న్ గా ఎదిగాడు. సంప్ర‌దాయం త‌ర్వాత చిరంజీవి హీరోగా న‌టించిన `మాస్ట‌ర్` (1997) చిత్రంలో న‌టించాడు. రెండు ద‌శాబ్ధాల పాటు 400 పైగా చిత్రాల్లో న‌టించి గొప్ప క‌మెడియ‌న్ గా ఎదిగాడు.

ఈ విష‌యాల‌న్నీ ఇటీవ‌ల‌ ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ చెప్పారు. అలాంటి స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తినా తన మూలాలను.. ఇతర బాధలను బంధ‌నాల్ని మరిచిపోలేదు. వేణు మాధవ్‌ మంచి తనానికి మారుపేరు అంటూ స‌హ‌న‌టుడు ఉత్తేజ్ అత‌డి గురించి చెప్పిన‌ది అత‌డి మంచిత‌నాన్ని తెలియ‌జెబుతుంది. ఓ షూటింగ్ టైమ్ లో ఓ నటుడు వచ్చి వేణు మాధవ్‌ ను సహాయం అడిగాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని.. ధ‌న‌సాయం చేయమని చెబితే.. వేణుమాధవ్ ఆయనకు భోజనం పెట్టారు. ఇక ఎలాంటి సహాయం చేస్తాడోన‌ని చూస్తుంటే.. డ‌బ్బు ఇస్తే రెండు రోజుల్లో తాగి తగిలేస్తే భార్య.. పిల్లల పరిస్థితి ఏమ‌వుతుందో ఆలోచించావా? అందుకే రెండు క్వింటాల బియ్యం.. రెండు నెలలకు సరిపడే పప్పు.. ఉప్పులు ఆ నటుడికి సహాయం చేశాడు అని ఉత్తేజ్ తెలిపారు. వేణుమాధ‌వ్ మ‌ర‌ణ‌వార్త ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని క‌ల‌చివేసింది. ప్ర‌స్తుతం అత‌డి వార్త గూగుల్ ట్రెండింగ్ లో హైలైట్ గా ఉంది.