Begin typing your search above and press return to search.

ఈసారైనా బోయపాటి ఆ హీరోకి లైఫ్ ఇస్తాడా..?

By:  Tupaki Desk   |   11 May 2020 8:00 PM IST
ఈసారైనా బోయపాటి ఆ హీరోకి లైఫ్ ఇస్తాడా..?
X
టాలీవుడ్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలలో ఉమ్మడి కుటుంబాలు, రాజకీయం, హీరో మాస్ ఎలివేషన్స్, భారీ ఫైట్స్ ఇలా అన్నీ అంశాలు మేళవించి ఓ భారీ కమర్షియల్ మూవీని రూపొందిస్తారు. ఇప్పటివరకు బోయపాటి రూపొందించిన అన్నీ సినిమాలలో ఈ అంశాలన్నీ కామన్. కానీ ఇంకో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కనిపించే ఆ పాత్ర సినిమా హిట్ ప్లాప్ లలో కూడా భాగం అవుతుంది. అవే భద్ర సినిమాలో హీరో ఫ్రెండ్, తులసిలో శివాజీ క్యారెక్టర్, దమ్ము సినిమాలో వేణు క్యారెక్టర్.. ఈ పాత్రలన్నీ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి కానీ విషాదంతో ముగుస్తాయి. అలా హీరో వేణు తొట్టెంపూడి కంబ్యాక్ గా వచ్చిన సినిమా దమ్ము. ఆ సినిమాలో హీరో బావమరిదిగా వేణు పాత్ర విషాదంగా ముగుస్తుంది. నటనకు స్కోప్ ఉన్నా.. వేణుకి పేరు మాత్రం రాలేదు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ వేణు కనిపించలేదు..

ఇప్పుడు వేణు గురించి ఎందుకని అనుకుంటున్నారా.. వేణు మళ్లీ బోయపాటి సినిమాలో కన్పించబోతున్నాడట. దమ్ము సినిమాతో హిట్ ఇవ్వలేక పోయిన బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న హ్యాట్రిక్ సినిమాలో వేణుకు ఓ ముఖ్యమైన పాత్ర డిజైన్ చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా బోయపాటి వేణుకి లైఫ్ ఇస్తాడేమో చూడాలి. గతంలో బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఎవరనే విషయం కూడా త్వరలో వెల్లడిస్తారని సమాచారం.