Begin typing your search above and press return to search.
దృశ్యం 2: వెంకీ సూచనలు.. మారుతున్న స్క్రిప్ట్!
By: Tupaki Desk | 25 Feb 2021 5:20 PM ISTవెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో 2014లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. మలయాళం రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. మోలీవుడ్ స్టార్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం-2 ఈ మధ్యనే ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. సూపర్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి సర్వం సిద్దమైంది. ఈ సీక్వెల్ రీమేక్ లో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. తెలుగు వెర్షన్ కు సైతం ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నారు.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రంలో పలు మార్పులు సూచించాడట వెంకీ. రిలీజ్ కు ముందే ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీన్ లో వీక్షించారు వెంకటేష్. ఆ తర్వాత తన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో సుదీర్ఘంగా చర్చించారు. ఓటీటీ రిలీజ్ కాబట్టి.. తెలుగు వాళ్లు కూడా చాలా మంది చూసే అవకాశం ఉంటుందని, అందువల్ల రీమేక్ చేయాలా వద్దా? అని తర్జనభర్జన పడ్డారు. చివరకు రీమేక్ చేయడానికే మొగ్గుచూపారు.
అయితే.. తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా పలు మార్పులు సూచించారట. దీంతో.. దర్శకుడు జీతు జోసెఫ్.. వెంకీ సూచనల ప్రకారం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. కాగా.. ఈ చిత్రాన్ని మొత్తం 50 రోజుల్లోనే పూర్తిచేయబోతున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో ఆశిర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.