Begin typing your search above and press return to search.

నాలుగు నెల‌ల్లోనే 3 రిలీజ్ లతో వెంకీ రికార్డ్ బ్రేకింగ్

By:  Tupaki Desk   |   4 April 2021 11:22 AM IST
నాలుగు నెల‌ల్లోనే 3 రిలీజ్ లతో వెంకీ రికార్డ్ బ్రేకింగ్
X
విక్ట‌రీ వెంక‌టేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌తో ఆయ‌న ఇవ్వ‌బోతున్న ట్విస్ట్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

కేవ‌లం నాలుగు నెలల్లో 3 రిలీజ్ ల‌తో విక్ట‌రీ వెంక‌టేష్ రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్నారంటూ తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వెంకీ న‌టించిన నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ఇప్పటికే విడుదలకు తేదీలు లాక్ చేసేశారు. ఈ రెండిటి మ‌ధ్య‌లో దృశ్యం 2ని రిలీజ్ చేసేందుకు వెంకీ ప‌క్కాగా ప్లాన్ ని సిద్ధం చేశార‌ని తెలుస్తోంది.

వెంక‌టేష్ - మీనా జంట‌గా రీమేక్ మూవీ దృశ్యం2 చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. కేర‌ళ అడ‌వుల్లో జీతూజోసెఫ్ షూటింగ్ ని ప‌రుగులు పెట్టిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే 50శాతం పూర్త‌యింద‌ని జూలై రిలీజ్ ల‌క్ష్యంగా ప్ర‌తిదీ పూర్తి చేస్తున్నార‌ని చెబుతున్నారు. దృశ్యం 2 మొత్తం షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. జూన్ చివరి నాటికి ఈ చిత్రం అన్ని ప‌నులు ముగించి జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తార‌ట‌. అంటే .. మే - జూలై- ఆగ‌స్టు .. కేవ‌లం నాలుగు నెల‌ల్లో మూడు రిలీజ్ ల‌కు ప్లాన్ ఖాయ‌మైన‌ట్టేన‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.