Begin typing your search above and press return to search.

చ‌క‌చ‌కా మూడు లైన్ లో పెట్టిన‌ వెంకీ.. ఇంత‌లోనే!

By:  Tupaki Desk   |   2 May 2021 9:48 AM GMT
చ‌క‌చ‌కా మూడు లైన్ లో పెట్టిన‌ వెంకీ.. ఇంత‌లోనే!
X
చ‌క‌చ‌కా మూడు సినిమాల్ని లైన్ లో పెట్టిన విక్ట‌రీ వెంక‌టేష్ కి మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. కోవిడ్ సెకండ్ వేవ్ విల‌యం ఈ సీనియ‌ర్ హీరోకి ముప్పుగా మారింది. నార‌ప్ప‌తో పాటు దృశ్యం 2- ఎఫ్ 3 సినిమాలు కూడా వాయిదా ప‌డ‌బోతున్నాయనేది తాజా స‌మాచారం.

సూప‌ర్ సీనియ‌ర్ హీరో కేట‌గిరీలో మిగ‌తా వారి కంటే స్పీడ్ గా సినిమాలు చేస్తున్న వెంకీకి బోలెడంత కితాబు ద‌క్కుతోంది. కానీ ఇంత‌లోనే అంతా మారిపోయింది. మొత్తం ప్లాన్ డిస్ట్రబ్ అయ్యే ప‌రిస్థితి క‌రోనా తీసుకువ‌చ్చేసింది. 2021లో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం అనుకున్న‌వ‌న్నీ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక దృశ్యం 2 షూట్ మొత్తం కేర‌ళ‌లోనే తీస్తున్నారు. అక్క‌డ లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉండంతో ఈ షూట్ ఇప్పుడ‌ప్పుడే మ‌ళ్లీ తిరిగి మొద‌లైయ్యే అవ‌కాశ‌మే లేదు. నార‌ప్ప చాలా వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ చేసినా.. ఎఫ్ 3 రీసెంటుగా మొద‌లైంది కాబ‌ట్టి దీనికి ఇంకా చాలా ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఏదోలా వేగంగా గ‌ట్టెక్కించే ప‌రిస్థితి అయితే ఇప్ప‌ట్లో లేన‌ట్టే. ప్ర‌స్తుతానికి వెంకీ పూర్తిగా నిర్భంధంలో ఉండాల్సిన స‌న్నివేశం ఉంది. వెంకీ ఒక్క‌రే కాదు... మ‌రో పాతిక టాలీవుడ్ సినిమాల షూటింగుల‌ను ఆపేసిన సంగ‌తి తెలిసిందే.