Begin typing your search above and press return to search.

వెంకీ మామ రిలీజ్ ఫిక్స్.. డేట్ ఇదే

By:  Tupaki Desk   |   2 Nov 2019 11:01 AM GMT
వెంకీ మామ రిలీజ్ ఫిక్స్.. డేట్ ఇదే
X
విక్ట‌రీ వెంక‌టేష్- నాగ‌చైతన్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సినిమా వెంకీ మామ‌. 'స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్' ఫేం బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డి.సురేష్ బాబుతో క‌లిసి పీపుల్స్ మీడియా సంస్థ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మామ - అల్లుళ్ల‌ను క‌లిపి బాబి చేస్తున్న ఈ ప్ర‌య‌త్నంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన టీజ‌ర్.. పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ద‌స‌రా దీపావ‌ళి అంటూ మామ అల్లుళ్ల పోస్ట‌ర్ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటే మొన్న రిలీజ్ చేసిన‌ పోస్ట‌ర్ల‌లో స‌రైన క్లారిటీనివ్వ‌లేదు. వెంకీ మామ సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతుంద‌న్న ఊహాగానాలు అయితే సాగాయి. కానీ ఈసారి సంక్రాంతి పందెంలో పోటీ తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని వెన‌క్కి త‌గ్గార‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత రిలీజ్ తేదీ ఇదీ అంటూ సురేష్ కాంపౌండ్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌లేదు.

తాజాగా తుపాకి ఎక్స్ క్లూజివ్ స‌మాచారం ప్ర‌కారం.. వెంకీ మామ రిలీజ్ తేదీని ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ 13న వెంకీ మామ రిలీజ్ కానుంది. ఈ సంగ‌తిని టీమ్ అధికారికంగా మీడియాకి వెల్ల‌డించ‌నుంద‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ 13 అంటే క్రిస్మ‌స్ సెల‌వుల వ‌ర‌కూ ఆగ‌కుండా రెండు వారాల‌ ముందే రిలీజ్ కి వ‌చ్చేస్తున్నారు. ఇదే తేదీకి వేరొక సినిమా రాక‌పోవ‌డం వెంకీ మామ‌కు క‌లిసొచ్చే అంశ‌మే. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 20న మూడు భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. క్రిస్మ‌స్ ని పుర‌స్క‌రించుకుని రూల‌ర్-ప్ర‌తిరోజు పండ‌గే-డిస్కోరాజా చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. అంటే వారం పాటు 'వెంకీ మామ‌'కు స్కోప్ ఉంటుంద‌న్న‌మాట‌.