Begin typing your search above and press return to search.

రెమ్యూనరేషన్ తగ్గించాలని 'వెంకీ మామ' ప్లాన్

By:  Tupaki Desk   |   3 July 2018 11:12 AM GMT
రెమ్యూనరేషన్ తగ్గించాలని వెంకీ మామ ప్లాన్
X
టాలీవుడ్లో చాలామందే హీరోయిన్లు ఉన్నారు. ఆలా అని దర్శకనిర్మాతలు బాలీవుడ్ నుండి కొందరు సుందరీమణుల ను అరువు తెచ్చుకోవడం మానటంలేదు. ఇందులో అందరికి తెలిసిన విషయం ఏంటంటే - వారి రెమ్యూనరేషన్ల విషయంలో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటుంది. కొందరు మాత్రం అనుకున్న దానికంటే తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇంతకీ ఎం జరిగిందంటే.. దగ్గుబాటి వెంకటేష్ - నాగ చైతన్య నిజజీవితలో కూడా మామా అల్లుళ్లే. వీరిద్దరూ ఇప్పుడు ఒక మల్టీస్టారర్ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టారు. చైతు కోసం 'రారండోయ్ వేడుక చూద్దాం' లో త పక్కన నటించిన రకుల్ నే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వెంకీ మామ' అనే టైటిల్ దాదాపు ఖరారు అయినట్టే. వెంకీ పక్కన నటించడానికి బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి ని తీసుకున్నారనే రూమర్ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా గట్టిగా నడుస్తోంది. అసలే వెంకటేష్ కోసం వయసు వల్ల హీరోయిన్లు కరువైపోయారు. పైగా హ్యూమా కి కూడా పెద్దగా హిట్లేవి లేకపోయేసరికి ఈ సినిమా తనకు బ్రేక్ ఇస్తుందని ఆశల్లో ఉంది.

కాకపోతే ఈ మధ్యనే హ్యూమా నటించిన కాలా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనుక ఈమెకు రెమ్యూనరేషన్ విషయంలో తేడా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాతలు ఆమెను కోరుతున్నారట. ఒకవేళ హ్యూమా పే చెక్ విషయంలో వెనక్కు తగ్గకపోతే వేరే హీరోయిన్ ను తీసుకుందామని ప్రయత్నాలు కూడా చేస్తారని తెలుస్తోంది.