Begin typing your search above and press return to search.

వెంకీ మామా మ‌జాకా ఇర‌గ‌దీసేశాడ‌టగా

By:  Tupaki Desk   |   8 April 2022 8:03 AM GMT
వెంకీ మామా మ‌జాకా ఇర‌గ‌దీసేశాడ‌టగా
X
వ‌రుస యాక్ష‌న్ చిత్రాల‌తో విసిగిపోతున్న ప్రేక్ష‌కుల‌కు ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని అందించి టీవీల‌కు అతుక్కుపోయిన మ‌హిళా ప్రేక్ష‌కుల్ని కూడా థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌ని అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ చేసిన సాలీడ్ ప్ర‌య‌త్న‌మే 'ఎఫ్ 2'( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). వెంకీ మామ విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ తొలి సారి క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీగా భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం 2019 సంక్రాంతి బ‌రిలో నిలిచి అనూహ్యంగా రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది.

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం 100 కోట్ల మార్కుని చేరుకోవ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్ ని కూడా విస్మ‌యానికి గురిచేసింది. దాదాపు 30 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో 127 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. విక్ట‌రీ వెంక‌టేష్ టైమింగ్‌, వెంకీ ఆస‌న్ , డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి టేకింగ్ ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టాయి.

ఇదే ఫార్ములాతో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం 'ఎఫ్ 3'. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ కి మ‌రో యాంగిల్ ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విక్ట‌రీ వెంక‌టేష్ , వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్ లు. దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

'ఎఫ్ 2' తో వంద కోట్ల‌కు మించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని కొల్ల‌గొట్టిన దిల్ రాజు ఈ ద‌ఫా 'ఎఫ్ 3'తో ఏ స్థాయి మ్యాజిక్ ని చేయ‌బోతున్నారా అని చ‌ర్చ న‌డుస్తోంది.

క‌రోనా, ఒమిక్రాన్ ల కార‌ణంగా భారీ చిత్రాల రిలీజ్ లు వ‌రుస‌గా వాయిదా ప‌డిన నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్ కూడా వ‌రుస‌గా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఫైన‌ల్ గా మే 27న ఈ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు ప్రారంభించారు కూడా. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎఫ్ 2కు త‌న‌దైన టైమింగ్ మ్యాజిక్ తో మేజిక్ చేసిన వెంకీ మామా 'ఎఫ్ 3'లోనూ అదే త‌ర‌హాలో ఆక‌ట్టుకోబోతున్నార‌ట‌.

సినిమాలోని లాస్ట్ 25 నిమిషాలు హిలేరియ‌స్ గా వుంటుందని, వెంకీ మామ త‌న‌దైన టైమింగ్ తో మ్యాజిక్ చేశార‌ని, ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇక టాక్ కు సంబంధం లేకుండా ఊహించ‌ని స్థాయిలో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని, ఈ విష‌యంలో నాదీ గ్యారెంటీ అని దర్శ‌కుడు అనిల్ రావిపూడి అంటున్నారు.