Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోతో 'భీష్మ' డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   17 May 2021 1:30 PM GMT
అక్కినేని హీరోతో భీష్మ డైరెక్టర్..?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస హిట్ సినిమాలతో జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇంకాస్త స్పీడ్ పెంచిన చైతన్య.. ఇప్పటికే 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తి చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన ఈ చిత్రాన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల చేయనున్నారు.

ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం 'మనం' ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇదే క్రమంలో చైతూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించనున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లోని బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రనే ‘లాల్‌ సింగ్‌..’ లో చైతన్య పోషించనున్నారని సమాచారం. జూన్‌ లో లడఖ్ లో జరిగే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ లో ఆయన పాల్గొననున్నారు.

ఇలా ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న నాగచైతన్య.. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ని లైన్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. 'ఛలో' 'భీష్మ' వంటి వరుస హిట్స్ అందుకున్న వెంకీ.. నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వెంకీ మెగా హీరోతో ఓ సినిమా చేయనున్నాడని.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే '#SSMB28' కోసం వర్క్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్య తో యువ దర్శకుడు ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.