Begin typing your search above and press return to search.

ఛలో డైరెక్టర్ ను పక్కన పెట్టలేదట

By:  Tupaki Desk   |   6 Jun 2018 4:39 AM GMT
ఛలో డైరెక్టర్ ను పక్కన పెట్టలేదట
X
మంచి ప్రేమకథకు హ్యూమర్ యాడ్ చేసి ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ మూవీ నాగశౌర్య కెరీర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మొదటి సినిమానే అయినా ఎక్కడా అలా అనిపించకుండా ఎంటర్ టెయినింగ్ గా తీయడంతో వెంకీ కుడుముల టాలెంట్ కు గుర్తింపు వచ్చింది.

ఛలో సినిమా తరవాత వెంకీ తన తరవాత సినిమాను నితిన్ తో తీయడానికి రెడీ అయ్యాడు. ఓ సబ్జెక్ట్ నితిన్ కు వినిపించినా అది అతడికి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారనే టాక్ వినిపించింది. కానీ నితిన్ ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనేమీ పెట్టేయలేదని తెలుస్తోంది. డైరెక్టర్ నితిన్ తో టచ్ లోనే ఉన్నాడట. సినిమా స్టార్ట్ చేయడానికి ముందే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసి పనిలో వెంకీ కుడుముల బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని... త్వరలోనే ఫినిషింగ్ టచెస్ పూర్తి చేసి షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో వెంకీ కుడుముల ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. అప్పటికి దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న శ్రీనివాస కళ్యాణం షూటింగ్ పూర్తయిపోతుంది. తరవాత వెంకీ కుడుముల సినిమా షూటింగ్ లో జాయినయ్యే అవకాశం ఉంది. సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మించనుంది.