Begin typing your search above and press return to search.

ప్లేబోయ్ రోల్ 20 నిమిషాలే!

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:17 AM GMT
ప్లేబోయ్ రోల్ 20 నిమిషాలే!
X
ఏడాది పొడ‌వునా శ్ర‌మించి రిలీజ్ ముంగిట టెన్ష‌న్ అనుభ‌వించే వాళ్ల‌లో ద‌ర్శ‌కుడి షేర్ చాలా పెద్ద‌ది. `తొలి ప్రేమ` సినిమాతో వ‌రుణ్ తేజ్ కి హిట్టిచ్చాన‌న్న సంతోషంలో ఉండ‌గానే అక్కినేని హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు వెంకీ అట్లూరి. 9 నెల‌ల‌పాటు అహో రాత్రులు శ్ర‌మించాడ‌ట వెంకీ. ఈ శుక్ర‌వారం తొలి రిపోర్ట్ అంద‌నుంది. తొలి వీకెండ్ నాటికే సినిమా రిజ‌ల్ట్ ఏంటో చెప్పేస్తారు. నేటి సాయంత్రం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో వెంకీ ఎంతో టెన్ష‌న్ తో క‌నిపించాడు.

`మిస్ట‌ర్ మ‌జ్ను` గురించి విలేక‌రులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తే .. ఒక్కో ప్ర‌శ్న‌కు చాలా ఓపిగ్గానే స‌మాధానాలిచ్చాడు. సినిమా గురించి వెంకీ అట్లూరి మాట్లాడుతూ - ``మిస్టర్‌ మజ్ను నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. ప్రతి ఒక్కరూ సినిమా చూసి తీరాలి. అఖిల్‌ ఈ సినిమాలో చ‌క్క‌గా నటించారు. ఇందులో అత‌డు ఓ ప్లేబోయ్ గా 20 నిమిషాలే కనబడినా ఆద్యంతం మెరుపులు మెరిపిస్తాడు. మిగతా సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ మైమ‌రిపిస్తాయి. కంబైన్డ్‌ ఫ్యామిలీ ఇబ్బందులు ఆకట్టుకుంటాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఎగ్జయిట్ అయ్యే ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటాయి. థమన్‌ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టారు. జార్జి సి.విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ హైలైట్. ప్రతి ఫ్రేమ్ ను బ్యూటిఫుల్ గా చూపించారు. నిధి న‌ట‌న ఫ్యాబ్యుల‌స్. అలాగే హైపర్‌ ఆది - ప్రియదర్శితో మంచి కామెడీ ట్రాక్‌ ఉంటుంది... అని తెలిపారు.

త‌న రెండు కోరిక‌ల గురించి చెబుతూ.. ఈ సినిమాకి నేను రెండు విషయాలు అనుకున్నాను. మొదటిది సినిమాకి `మిస్టర్‌ మజ్ను` టైటిల్‌ అనుకున్నాను. రెండవది అక్కినేని వారసుడుతో సినిమా తీయాలనుకున్నాను. ఆ రెండూ నెరవేరినందుకు అఖిల్ కి - బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్ గారికి థాంక్స్‌. థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూసి మంచి ఫీల్‌ తో బయటకు వస్తారు.. అని తెలిపారు. ఈ సినిమా కథ 2012లోనే రాసుకుని తొలిగా దిల్‌ రాజుగారికి చెప్పాను. దర్శకుడిగా కొంచెం అనుభ‌వం వ‌చ్చాక‌ ఈ సినిమా చేయమని సలహా ఇచ్చారు. అందుకే రెండో చిత్రంగా ఈ కథను తెరకెక్కించాను. అఖిల్‌ ఈ సినిమాకి 100 శాతం యాప్ట్‌. ఈ సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్ మిరాకిల్. డబ్బింగ్‌ కూడా కమిట్‌మెంట్ తో మూడు రోజుల్లోనే పూర్తి చేశాడు. సిస‌లైన ప్రేమికుడి ఎమోషన్స్‌తో పాటు చిలిపిగా సాగే ప్రేమక‌థా చిత్ర‌మిది`` అని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.