Begin typing your search above and press return to search.

తొలిప్రేమ గ్యాంగ్ మళ్లీ సెట్టయ్యిందా?

By:  Tupaki Desk   |   6 March 2018 2:30 AM GMT
తొలిప్రేమ గ్యాంగ్ మళ్లీ సెట్టయ్యిందా?
X

ఒక్క హిట్ అందుకుంటే హీరోల క్రేజ్ ఏ స్థాయిలో మరిపోతుందో అంతకంటే ఎక్కువ దర్శకుల ఫెట్ మారిపోతుంది. హిట్టుకోసం ఇప్పుడు హీరోలు చాలా పరితపిస్తున్నారు. దీంతో ఒక్క హిట్ అందుకున్న దర్శకుడు దొరికితే చాలు వెంటనే సినిమా చేయడానికి ఒప్పేసుకుంటున్నారు. దర్శకుడిలో మిడియామ్ లార్జ్ అనే స్కెల్ లో ఒకప్పుడు నిర్మాతలు ఎక్కువగా ఆలోచించేవారట. కానీ ఈ రోజుల్లో అలా ఎవరు లెక్కలు వేసుకోవడం లేదు.

చిన్న సినిమా అయినా సరే నాలుగు రూపాయల లాభాన్ని అందించింది అంటే దర్శకుడికి మంచి అవకాశాలను ఇస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల వచ్చిన వరుణ్ తేజ్ - తొలిప్రేమ సినిమా ఎంత మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరికి మంచి ప్రశంసలు అందాయి. మొదట ఆ సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లింది. కానీ దర్శకుడిని చూసి కొంత మంది నో చెప్పారు. కానీ ఫైనల్ గా వరుణ్ - నిర్మాత బివిఎస్ ఎన్.ప్రసాద్ నమ్మకం ఉంచి దర్శకుడికి ఫ్రీడమ్ ఇచ్చారు. దీంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయంతో సంతోషంలో నిర్మాత దర్శకుడికి మరో అవకాశాన్ని ఇచ్చాడట.

వెంకీ అట్లూరి తన రెండవ కథని అయితే ప్రస్తుతానికి సెట్ చేసుకోలేదు. అయితే త్వరలో లవ్ యాంగిల్ కాకుండా ఒక డిఫెరెంట్ కథను తెరకెక్కించాలని మనసులో అనుకుంటున్నాడట. ఏ కథ చేసినా కూడా నిర్మాత బివిఎస్ ఎన్. ప్రసాద్ ఒప్పుకునేట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సెకండ్ సినిమాని ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.