Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డితో తొలిప్రేమ అంటాడా

By:  Tupaki Desk   |   22 Jan 2019 7:06 AM GMT
అర్జున్ రెడ్డితో తొలిప్రేమ అంటాడా
X
గత ఏడాది ఒక సూపర్ హిట్ టాక్సీ వాలా రెండు ఇండస్ట్రీ హిట్లు మహానటి-గీత గోవిందం తన ఖాతాలో వేసుకుని యమా జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ రూపొందుతోందని టాక్. దీంతో పాటు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విజయ్ ఇవి కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

గత ఏడాది వరుణ్ తేజ్ తొలిప్రేమతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ శుక్రవారం మిస్టర్ మజ్నుగా అఖిల్ ని చూపించబోతున్నాడు. అఖిల్ కి మొదటి హిట్ ఇదే అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. ఇదిలా ఉంచితే వెంకీ అట్లూరి మూడో సినిమా విజయ్ దేవరకొండతోనే అని ఫ్రెష్ అప్ డేట్. విజయ్ దేవరకొండ మైత్రికు రెండు ప్రాజెక్ట్స్ సైన్ చేసాడు. ఒకటి ఇప్పుడు నిర్మాణంలో ఉన్న డియర్ కామ్రేడ్. రెండోదాని కోసమే వెంకీ అట్లూరి కాంబినేషన్ ని విజయ్ కోసం సెట్ చేస్తున్నారట నిర్మాతలు.

అయితే మిస్టర్ మజ్ను విడుదల అయ్యాకే కథను వినిపిస్తానని వెంకీ చెప్పడంతో హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. సున్నితమైన ప్రేమ కథను యూత్ కి నచ్చేలా తీస్తున్న వెంకీ అట్లూరితో మూవీ అంటే విజయ్ కు వర్క్ అవుట్ అయ్యేదే. అయితే కథను ఫైనల్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళేలోపు కొంత టైం పట్టొచ్చు. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్న మైత్రి సంస్థ ఈ ప్రాజెక్ట్ ను సమ్మర్ లోపు స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది. అది విజయ్ దేవరకొండ ఇచ్చే డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది.