Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పంచెకట్టులో ఇరగదీస్తున్నారే

By:  Tupaki Desk   |   10 Nov 2019 10:10 AM GMT
ఫోటో స్టోరీ: పంచెకట్టులో ఇరగదీస్తున్నారే
X
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మల్టిస్టారర్ 'వెంకీమామ' ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. రీసెంట్ గా టీజర్.. ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఆటు టీజర్ కు..ఇటు వెంకీమామ టైటిల్ సాంగ్ కు మంచి స్పందన దక్కింది. తాజాగా 'వెంకీమామ' టీమ్ మరో కలర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్లో వెంకీ.. చైతు ఇద్దరు అచ్చమైన తెలుగు పంచెకట్టు.. మెరూన్ కలర్ షర్టు ధరించి సంతలో ఒక బెంచిపై కూర్చున్నారు. ఒకే విధమైన డ్రెస్ ధరించడమే కాకుండా సూపర్ గా నవ్వుతూ ఉన్నారు. చైతు అయితే మావయ్య మీద చెయ్యేసి మరీ నవ్వుతున్నాడు. ఈ పోస్టర్ ను చూస్తే మామ అల్లుడి కెమిస్ట్రీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో రిలీజ్ చేసిన 'వెంకీమామ' పోస్టర్లతో పోలిస్తే ఈ పోస్టర్ మరింత బ్రైట్ గా ఉంది. ట్రెడిషనల్ డ్రెస్.. ఆ నవ్వులు చూస్తుంటే పండగ వాతవరణం తలపిస్తోంది.

సినిమాలో వెంకీ రైతుగానూ.. చైతు ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలోనూ నటిస్తున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. చైతు సరసన రాశి ఖన్నా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.