Begin typing your search above and press return to search.

'నారప్ప' తెలుగు ప్రేక్షకులను మెప్పించేనా..?

By:  Tupaki Desk   |   14 Nov 2020 2:30 AM GMT
నారప్ప తెలుగు ప్రేక్షకులను మెప్పించేనా..?
X
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''నారప్ప''. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్' కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ పై సురేష్ బాబు మరియు క‌లైపులి ఎస్.థాను వి క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియమణి నారప్ప భార్య సుందరమ్మగా కనిపించనుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే థ్రిల్లర్ అండ్ ఎమోషన్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో అని సినీ వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తెలుగులో ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమాలకి లిమిటెడ్ ఆడియెన్స్ ఉంటారనే టాక్ ఉంది. కరోనా టైమ్ లో 'నార‌ప్ప' బ‌డ్జెట్ రిక‌వ‌రీ చేయాలంటే క‌ష్ట‌మే అని మేకర్స్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యాన్స్ మాత్రం ‘ఎఫ్ 2’ ‘వెంకీమామ’ వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న వెంకటేష్ కు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. మరి వెంకటేష్ కెరీర్‌ లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'నారప్ప' ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'నారప్ప' కరోనా నేపథ్యంలో ఇటీవలే మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళాడు.