Begin typing your search above and press return to search.

రవితేజ సినిమాకు విక్టరీ వాయిస్..!

By:  Tupaki Desk   |   31 Dec 2020 11:10 PM IST
రవితేజ సినిమాకు విక్టరీ వాయిస్..!
X
రవితేజ, శ్రుతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం క్రాక్. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. జనవరి 14 న విడుదలవుతున్న ఈ మూవీకోసం మాస్ మహరాజ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రానికి సీనియర్ హీరో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయం లేటెస్ట్ గా లీకైంది. విక్టరీ వెంకటేష్ గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం వెంకటేష్ తన శక్తివంతమైన వాయిస్ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అడిషనల్ అసెట్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెంకీ వాయిస్ ఇచ్చాడన్న ప్రచారం నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ స్ట్రిక్ట్ పోలీసుగా నటించాడు. రేపు న్యూ ఇయర్ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు జోరందుకున్నాయి. సినిమాకు కూడా మంచి రేట్ వచ్చిందని టాక్. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్యూన్ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. బి మధు ఈ సినిమాను నిర్మించారు.

కాగా.. ఈ సినిమా సక్సెస్ కోసం రవితేజ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా గెలుపును టేస్ట్ చేయలేకపోతున్నాడు మాస్ మహరాజ్. ఆయన గత చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మరి, ఈ సినిమా విజయం సాధించి రవితేజకు పూర్వవైభవం తీసుకొస్తుందా? లేదా? అన్నది చూడాలి.