Begin typing your search above and press return to search.
నాగ్ తర్వాత వెంకీ..రెడీ అవుతున్న అనీల్!
By: Tupaki Desk | 5 Sept 2020 11:00 AM ISTఆరు నెలలుగా కరోనా కారణంగా నిలిచి పోయిన స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ మెల్లగా పునః ప్రారంభం అవుతున్నాయి. నాగార్జున తన 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నాడు. రెండు మూడు రోజులుగా నాగార్జున షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. బిగ్ బాస్ షో ను కూడా నాగార్జున చేయబోతున్నాడు. ఈ నెలలో మరికొందరు యంగ్ హీరోలు కూడా బరిలోకి దిగడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక వెంకటేష్ వచ్చే నెల నుండి షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
చివరి దశకు వచ్చి ఆగిపోయిన 'నారప్ప' సినిమాను వచ్చే నెలలో పూర్తి చేయాలని వెంకీ నిర్ణయించుకున్నారట. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ దర్శకుడు శ్రీకాంత్ కు మెసేజ్ కూడా వెళ్లిందట. అక్టోబర్ తో నారప్పను పూర్తి చేసి నవంబర్ లో తన సూపర్ హిట్ మూవీ 'ఎఫ్2' కు సీక్వెల్ గా రూపొందబోతున్న 'ఎఫ్ 3' షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే ఎఫ్ 3 స్క్రిప్ట్ ను పూర్తి చేసి అనీల్ రావిపూడి వెయిట్ చేస్తున్నాడు.
నవంబర్ నుండి ఎఫ్ 3 షూటింగ్ ను మొదలు పెట్టే విధంగా దర్శకుడు అనీల్ రావిపూడి నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల డేట్లు ఇతరత్ర విషయాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. నవంబర్ నెల పూర్తిగా వెంకీ పైనే సీన్స్ ఉంటాయట. ఆ తర్వాత వరుణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సినిమాను వచ్చ సమ్మర్ లేదా దసరాకు విడుదల చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడట. ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. వెంకీ తర్వాత మరికొందరు స్టార్స్ కూడా షూటింగ్ కు రెడీ అవుతారేమో చూడాలి.