Begin typing your search above and press return to search.
వెంకీ ఓ లుక్ వేస్తే బెటరేమో
By: Tupaki Desk | 14 Jun 2019 10:29 AM ISTబాలీవుడ్ లో ఇటీవలే విడుదలై కమర్షియల్ గా ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న దేదే ప్యార్ దేని వెంకటేష్ తో రీమేక్ చేస్తామని నిర్మాత సురేష్ బాబు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో నటించిన సీనియర్ హీరొయిన్ టబుని ఇప్పటికే లాక్ చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిన్న మన్మధుడు 2 టీజర్ వచ్చాక దానికి దీనికి ఓ కామన్ కనెక్షన్ ఉండటం ఆసక్తి రేపుతోంది.
అదేంటంటే దేదే ప్యార్ దేలో యాభై ఏళ్ళ వయసు వచ్చిన ఏజ్ బార్ హీరో పాతికేళ్ళ యువతితో ప్రేమలో పడతాడు. హింది వెర్షన్ లో చేసింది రకుల్ ప్రీత్ సింగ్. మన్మధుడు 2లో సేమ్ ఇలాగే పెళ్లి కాకుండానే వయసు ముదిరిన నాగ్ అంత అయిపోయే టైంలో లవ్ లో దిగుతాడు. ఇక్కడా హీరొయిన్ రకులే. అదే పాతికేళ్ళ యువతి పాత్రనే. సో రెండు హీరోల పాత్రల స్వభావాలు ఒక్కటే. కాకపోతే దేదే ప్యార్ దేలో అజయ్ దేవగన్ ముందే మొదటి భార్యతో విడాకులు తీసుకుంటాడు. మన్మధుడు 2లో నాగ్ కు అసలు పెళ్ళే అయ్యుండదు. అదొక్కటే తేడా
ఇప్పుడు మన్మధుడు 2 విడుదలయ్యాక ఆ పోలికలు ఎంత వరకు క్లాష్ అవుతాయో చూసుకుని దానికి తగ్గట్టు మార్పులు చేస్తే బెటరేమో. లేకపోతే ఇలాంటి పాత్ర నాగ్ చేశాడు కదా అనే కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దర్శకుడు ఫిక్స్ అయ్యాక దేదే ప్యార్ దే తెలుగు వెర్షన్ లో కొన్ని చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రీవాస్ పేరు పరిశీలనలో ఉందన్నారు కాని ఇంకా ఎలాంటి ప్రకటన లేదు.
మన్మధుడు 2 ఆగస్ట్ 9 విడుదలవుతుంది. అప్పటికి దేదే ప్యార్ దే తెలుగు రీమేక్ స్టార్ట్ అయ్యుండదు. వెంకీ మామ రిలీజ్ చేశాకే దీన్ని సెట్స్ పైకి తీసుకెళతారు. మధ్యలో చాలా టైం ఉంది కాబట్టి ఆలోగా ఎంతైనా మార్చుకోవచ్చు. లేదూ ఒరిజినల్ లోని ఫీల్ పోతుందని అలాగే ఉంచుతారేమో చూడాలి. మొత్తానికి వెంకటేష్ నాగ్ ల మద్య చాలా కాలం తర్వాత ఓ కామన్ కనెక్షన్ రెండు సినిమాల్లోనూ కనిపిస్తోంది