Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు బాబాయి అబ్బాయి కలయిక.. కాని!

By:  Tupaki Desk   |   8 March 2021 6:30 AM GMT
ఎట్టకేలకు బాబాయి అబ్బాయి కలయిక.. కాని!
X
దగ్గుబాటి అభిమానులు సుదీర్ఘ కాలంగా వెంకటేష్‌ మరియు రానాల కాంబో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు సందర్బాల్లో వెంకటేష్‌ మరియు రానా కూడా కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కాని ఇద్దరి కాంబోలో సినిమా మాత్రం సెట్‌ అవ్వలేదు. ఇటీవల రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము కలిసి నటించేందుకు ఒక కథ సిద్దం అయ్యింది. త్వరలోనే చేస్తామని చెప్పుకొచ్చాడు. కాని ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. ఆ కథ విషయమై ఇంకా వర్క్‌ జరుగుతున్నట్లుగా ఉంది. ఈ లోపు దృశ్యం 2 రీమేక్ లో వీరిద్దరు కలిసి కనిపించబోతున్నారు.

మలయాళ సూపర్‌ హిట్‌ దృశ్యం 2 తెలుగు రీమేక్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. వెంకటేష్‌ ఈ రీమేక్ లో మోహన్ లాల్ పాత్రను చేయబోతున్న విషయం తెల్సిందే. ఇక ఒరిజినల్ వర్షన్‌ లో ఐజీ పాత్ర మురళి గోపి చేసిన పాత్రను తెలుగులో రానాతో చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. రానా చేస్తున్న కారణంగా ఐజీ పాత్రను కాస్త పెంచడంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్నారు. వెంకీ.. రానాలు కలిసి నటించాలనుకున్న అభిమానులకు ఇది కాస్త సంతోషంను కలిగించే విషయమే కాని 'వెంకీ మామ' వంటి కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ లో వీరిద్దరు కలిసి నటిస్తే బాగుండేదని అంటున్నారు. దృశ్యం 2 తర్వాత అయినా వీరిద్దరు మళ్లీ అలాంటి సినిమాలో కలిస నటిస్తారేమో చూద్దాం.