Begin typing your search above and press return to search.
బాబాయ్-అబ్బాయ్ మల్టీస్టారర్ కన్ ఫామ్..?
By: Tupaki Desk | 29 Dec 2020 11:08 AM ISTటాలీవుడ్ లో బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్లు చాలానే ఉన్నాయి. ఆ కాంబోలు సెట్ కావాలని, స్క్రీన్ పై చూసి సంబరపడాలని వారి అభిమాన గణాలు ఎంతో ఆరాటపడుతుంటాయి. అలాంటి వాటిల్లో వెంకటేష్-రానా, బాలయ్య-ఎన్టీఆర్, పవన్-రామ్ చరణ్ కాంబినేషన్లు ప్రముఖమైనవి. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వీటిల్లో ఓ కాంబో సెట్ అయ్యిందని, అన్నీ కుదిరితే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.
దగ్గుపాటి వారసులు త్వరలో ఓ మల్టీస్టారర్ లో కలిసి నటించబోతున్నాారని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు చాలా కాలంగానే సాగుతున్నాయి. వాస్తవానికి మూవీ మోఘల్ రామానాయుడు హయాం నుంచే ట్రై చేస్తున్నారు. వెంకటేష్- రానా, వెంకటేష్-నాగచైతన్యతో ఓ సినిమా చేయాలని రామానాయుడు ఆశపడ్డారు. కానీ.. సరైన కథలు దొరక్క చేయలేదు. ఆయన మరణాంతరం పెద్ద కుమారుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కూడా ప్రయత్నించి, చివరకు ఓ ఈ కాంబోను సెట్ చేశారు.
వెంకటేష్-నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తరువాత అందరి చూపూ క్రేజీ కాంబో వెంకటేష్-రానాపై పడింది. అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబాయ్- అబ్బాయిలు తమ కాంబినేషన్ కు సంబంధించిన సినిమా చర్చల్లో ఉందని, ఓకే అయిన వెంటనే ప్రకటిస్తామని చెప్పారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వీరి సినిమాకు ఓ దర్శకుడు దొరికాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘శతమానంభవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న ఈ మల్టీస్టారర్‌ను చిత్రీకరించనున్నాడట. ఆయన ప్రస్తుం ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా.. ఇటీవల వేగేశ్న సురేష్ బాబుకి ఓ కథ వినిపించాడట. ఈ కథ నచ్చడంతో సురేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అన్నీ.. అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాదే ప్రారంభించనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే జరిగితే వెంకీ-రానా ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోవడం ఖాయం.