Begin typing your search above and press return to search.

పొగడ్తలతో తడుస్తున్న శివగామి!

By:  Tupaki Desk   |   9 May 2015 9:47 AM GMT
పొగడ్తలతో తడుస్తున్న శివగామి!
X
తెలుగు సినిమాలు తెలిసిన వారికి రమ్యకృష్ణ గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు! 90ల్లో ఆమె చేసిన సినిమాలు, చేసిన క్యారెక్టర్లు, వేసిన నృత్యాలు... వాటి లెక్కేవేరు! కెరీర్‌ బిగినింగ్‌లో కొన్నాళ్లు ‘ఐరన్‌ లెగ్‌’ అనిపించుకున్నా... తన కోసమే జనాలను ధియేటర్లకు రప్పించే స్థాయిని సాధించింది. అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, బంగారు బుల్లోడు, అల్లుడా మజాకా, హలో బ్రదర్‌ వంటి చిత్రాల్లోని ఆమె అందాల్ని, అభినయాన్ని అంత తేలిగ్గా ఎవరు మర్చిపోగలరు? ఆ సంగతి అటుంచితే... అప్పుడేప్పుడో రజనీకాంత్ సినిమా నరసింహా లో ఎవ్వరూ ఊహించని పవర్ ఫుల్ పాత్రలో చేసి, మెప్పించిన రమ్యకృష్ణ ... తాజాగా బాహుబలి సినిమాలో చేస్తుంది! ఈ సినిమాకోసం ఎన్నో సినిమాలను పక్కకు నెట్టేసిన రమ్యకృష్ణకు సంబందించిన బాహుబలి సినిమా పోస్టర్ ను రాజమౌలి రిలీజ్ చేశారు!
బాహుబలి మూవీలో రమ్యకృష్ణ పోషిస్తున్న శివగామి క్యారెక్టర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైన తర్వాత ఈ రెండున్నరేళ్ల సినిమా ప్రొడక్షన్‌లో ఆమె ఎంతో కీ రోల్ ప్లే చేసిందంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు జక్కన్న! ఇదే సమయంలో ఏ సినిమావాళ్లనూ బహిరంగంగా కామెంట్ చేయడం కానీ, పొగడటం కానీ చేసి ఉండని విక్టరీ వెంకటేష్ కూడా... శివగామి పోస్టర్ చూసిన వెంటనే స్పందించారు! రమ్యకృష్ణ ప్రతిభ ఏంటో తనకు తెలుసంటూ... ఆమె టాలెంట్‌కి మార్కులేశాడు. ఇన్నేళ్ల కాలంలో ఆమెతో ఎన్నో సినిమాలు చేశాను. రమ్యకృష్ణ ఇండస్ట్రీలోనే మంచి టాలెంట్ వున్న నటి అంటూ అభినందనల్లో ముంచెత్తాడు. 'బాహుబలి'లో కూడా కచ్చితంగా ఆమె మాంచి ఫెర్‌ఫార్మెన్స్ చేసిఉంటుంది అనే ధీమా వ్యక్తంచేశాడు. ఫేస్‌బుక్ వేదికగా రమ్యకృష్ణ గురించి వెంకీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ సమయంలో తన సహ నటుడు, సీనియర్ నటుడు వెంకీ మెచ్చుకోవడంతో... రమ్యకృష్ణ చాలా సంతోషంగా ఉందట! ఇదేవిదంగా... రమ్యకృష్ణ పోస్టర్ చూసిన ప్రతీఒక్కరు... ఏదో రూపంలో ఆమెను మీచుకోకుండా ఉండలేక, ఏదో ఒక కామెంట్ పెడుతున్నారు!