Begin typing your search above and press return to search.

ఈ షాకులేంది విక్టరీ హీరో?

By:  Tupaki Desk   |   21 Sept 2015 4:00 AM IST
ఈ షాకులేంది విక్టరీ హీరో?
X
వెంకటేష్ తో సినిమానా.. అయ్యబాబోయ్.. అని యువ దర్శకులు బెంబేలెత్తి పోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ మధ్య వెంకీ ఏ ప్రాజెక్టునూ ఓ పట్టాన ఒప్పుకోవట్లేదని.. అంతా ఓకే అనుకున్నాక తీసి చెత్త బుట్టలో వేసేస్తున్నారని అంటున్నారు. మారుతితో ‘రాధ’ అనే సినిమా ముహూర్తం కూడా జరుపుకున్నాక ఆ ప్రాజెక్టు ఆగిపోవడం తెలిసిందే. గత కొన్నేళ్లలో మారుతితో పాటు ఇంకో నలుగురైదుగు దర్శకులు వెంకటేష్ తో సినిమాకు దాదాపుగా ఓకే అనుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకున్నట్లు సమాచారం. అందులో తేజ - వీరూ పోట్ల - చంద్రశేఖర్ ఏలేటి - దశరథ్ లాంటి దర్శకులున్నారు. వీళ్లందరితోనూ వెంకటేష్ సినిమా చేయడం ఖాయం అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. కానీ చివరికి ఏమైందో తెలియదు. ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి.

తాజాగా ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ తో వెంకీ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కట్లేదని సమాచారం. ఈ సినిమాకు నిర్మాత కూడా ఓకే అయ్యాక.. ఇక షూటింగ్ ఆరంభించడమే తరువాయి అనుకుంటుండగా వెంకీ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో క్రాంతి మాధవ్ తీవ్ర నిరాశకు గురయ్యాడట. ఐతే గతంలో చకచకా సినిమాలు చేసుకెళ్లిపోయిన వెంకీ ఈ మధ్య మరీ ఇంత డైలమాలో ఎందుకుంటున్నాడో టాలీవుడ్ జనాలకు అర్థం కావడం లేదు. గోపాల గోపాల విడుదలై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటిదాకా వెంకీ సినిమా మొదలు కాలేదు. ఆ మధ్య జూన్ లో రెండు సినిమాలు మొదలవుతాయని వెంకీనే స్వయంగా ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఒక్కటీ మొదలవలేదు.