Begin typing your search above and press return to search.

వెంకీ -త‌రుణ్‌ ప్రాజెక్ట్ ఆగిపోలేదట!

By:  Tupaki Desk   |   4 March 2020 4:49 AM GMT
వెంకీ -త‌రుణ్‌ ప్రాజెక్ట్ ఆగిపోలేదట!
X
2019 బ్లాక్ బ‌స్ట‌ర్ `ఎఫ్ 2`తో విక్టరీ వెంకటేష్ స‌క్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఫుల్‌ జోష్ తో స్పీడ్‌ పెంచి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల `వెంకీమామ`తో ఆకట్టుకున్నారు. నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్‌ వద్ద మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. కానీ ఎగ్జిబిష‌న్ కింగ్ డి.సురేష్ బాబు చేసిన ప్లాన్‌ ప్రకారం సేఫ్ జోన్ కి చేరుకోవ‌డం వెంకీకి అన్నిర‌కాలా ప్ల‌స్ అయ్యింది. ఇక వెంకీ నెక్ట్స్ ఏంటి? అంటే అసలు విష‌యంలోకి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం ధ‌నుష్ న‌టించిన‌ తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌ రీమేక్ లో వెంక‌టేష్‌ నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రియమణి కథానాయిక‌. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాని శ్రీ‌కాంత్ ఎంతో ఛాలెంజింగ్ గా తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది.

ఇదిలా ఉంటే వెంకీ నెక్ట్స్ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే త్రినాథరావు నక్కిన.. త్రివిక్రమ్‌ వంటి చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ప్రధానంగా `పెళ్ళిచూపులు` ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్ తో సినిమా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వైరల్‌ అయ్యాయి. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా వెంకీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈ స్క్రిప్టు ని తరుణ్ భాస్క‌ర్ ఇంకా పూర్తి చేయలేదని.. దాదాపు ఈ ప్రాజెక్ట్ లేన‌ట్టేన‌నే కామెంట్స్ కూడా వినిపించాయి. తాజా సమాచారం మేరకు తరుణ్‌ భాస్కర్‌ తన స్క్రిప్ట్ ని పూర్తి చేశారట. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి సురేష్‌బాబు- వెంకీ ద్వ‌యాన్ని మెప్పించాడ‌ని తెలిసింది. వెంకీ ఇప్ప‌టికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశార‌ట‌. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ లో సాగే సినిమా. ఇందులో వెంకీ క్రీడాకారుడిగా కనిపించే ఛాన్స్ ఉందని సమాచారం. `గురు`లో వెంకీ బాక్సర్ గా... బాక్సింగ్‌ గురువుగా..`వసంతం`లో క్రికెటర్ గా ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.