Begin typing your search above and press return to search.

ల‌క్కీ హ్యాండ్ కు ప‌రీక్ష పెట్టేశాడుగా!

By:  Tupaki Desk   |   18 May 2019 5:32 AM GMT
ల‌క్కీ హ్యాండ్ కు ప‌రీక్ష పెట్టేశాడుగా!
X
సెంటిమెంట్ల‌కు సినిమాకు మ‌ధ్య‌నున్న అనుబంధం ఎంత చెప్పినా త‌క్కువే. సినిమా అన్న‌ది వ్యాపారం కావ‌టం.. ఫ‌లానా పని చేస్తే మీ సినిమా హిట్ ఖాయ‌మ‌న్న మాట చెప్పింది ఆల‌స్యం.. ఆ ప‌నిని చేసేసే వాళ్లెంద‌రో. కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు పెట్టే వేళ‌.. కొన్ని సెంటిమెంట్స్ ను ఫాలో అయితే పోయేదేముంది? అనుకోవ‌టం కామ‌నే. ఇదంతా ఎందుకంటే.. ఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత‌.. సీనియ‌ర్ న‌టుడు వెంక‌టేశ్ ల‌క్కీ మ్యాన్ గా మారిపోయారు.

ఆయ‌న చేతుల మీదుగా ఆడియో లాంఛ్ కానీ.. ట్రైల‌ర్ లాంఛ్ కానీ చేయించుకుంటే స‌క్సెస్ ప‌రుగులు పెడుతూ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం పెరుగుతోంది. ఈ మాట‌ను నిజం చేస్తూ జెర్సీ.. మ‌హ‌ర్షి మూవీస్ నిరూపించాయి. దీంతో.. వెంకీ హ్యాండ్ ఇప్పుడు య‌మా ల‌క్కీ అన్న పేరు వ‌చ్చేసింది.

తాజాగా డ‌బ్బింగ్ సినిమా రైట్స్ తో ప‌లు హిట్లు కొట్టేసిన నిర్మాత సురేశ్ కొండేటి తాజాగా త‌న హ‌ర్ర‌ర్ కామెడీ మూవీ ట్రైల‌ర్ ను వెంక‌టేశ్ చేత లాంఛ్ చేయించారు. వెంకీది ల‌క్కీ హ్యాండ్ కావ‌టంతో త‌న తాజా మూవీ లిస్సా ట్రైల‌ర్ విడుద‌ల‌కు ఆయ‌న్ను ఒప్పించారు. త‌న‌కు సుప‌రిచితుడైన సురేశ అడ‌గ‌టంతో వెంక‌టేశ్ కాద‌న‌లేక‌పోయారు.

అంజ‌లి న‌టించిన ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఒక‌వేళ ఈ సినిమా కానీ హిట్ అయితే.. వెంకీ ల‌క్కీ హ్యాండ్ పేరు స్థిర‌ప‌డిపోవ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున నిర్మాత‌లు వెంకీని ఫంక్ష‌న్ల‌కు.. త‌మ ట్రైల‌ర్ల రిలీజ్ కు వాడేయ‌టం ఖాయ‌మంటున్నారు. వెంకీ ల‌క్కీ హ్యాండ్ ఇమేజ్ కు సురేశ్ అస‌లుసిస‌లు ప‌రీక్ష పెట్టిన‌ట్లే.