Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : 90ల్లో సూపర్ స్టార్ తో విక్టరీ స్టార్

By:  Tupaki Desk   |   9 July 2020 8:30 AM GMT
పిక్ టాక్ : 90ల్లో సూపర్ స్టార్ తో విక్టరీ స్టార్
X
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో పాత ఫోటోలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ పాత ఫోటోలు త్రోబ్యాక్ ఫొటోస్ అంటూ అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఎంతో మంది అభిమానులు కూడా తమ స్టార్స్ పాత ఫోటోలు ఉంటే నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు ఎదో ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ తో వెంకటేష్ చాలా సిన్సియర్ గా ఒక అభిమానిగా చేతులు వెనక్కు పెట్టుకుని ఉన్నాడు. 1990 కాలంలో ఈ ఫోటో తీసి ఉంటారు. ఇందులో కృష్ణ కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వెంకటేష్ ఎదో పాట సినిమా కార్యక్రంలో భాగంగా ఈ ఫోటో తీసి ఉంటారు. వీరిద్దరి కలయిక కన్నుల పండుగగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.