Begin typing your search above and press return to search.

ఫస్ట్ సినిమాతోనే 'పెదవి తాంబూలం' అందుకున్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   19 May 2020 3:00 PM GMT
ఫస్ట్ సినిమాతోనే పెదవి తాంబూలం అందుకున్న స్టార్ హీరో
X
విక్టరీ వెంకటేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసిన హీరో. 30యేళ్ల సినీ చరిత్ర కలిగిన ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, ఎందరో గొప్ప దర్శకులతో కలిసి పనిచేసారు. ఇన్నేళ్లు సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సహజమైన నటనతో ఎలాంటి వారి మనసునైనా గెలిచే సత్తా ఉన్న హీరో వెంకటేష్ మాత్రమే. ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు. కానీ విక్టరీ వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేష్..

గత కొంతకాలం వరకు స్పీడ్ తగ్గించిన ఆయన వెంకీమామ సినిమా విజయంతో జోరు పెంచారు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్, తెలుగు నారప్పలో నటిస్తున్నారు వెంకి. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య అధర చుంబనం.. అదేనండి లిప్ లాక్ అనేది మాములు అయిపోయింది. మొదటగా హాలీవుడ్ లో ఈ లిప్ లాక్ ట్రెండ్ అది కాస్త ఇప్పుడు అన్నీ ఇండస్ట్రీలకు ఖచ్చితం అన్నట్లు మారింది. కానీ ఎల్లపుడు ఫ్యామిలీ సినిమాలతో ఆకట్టుకునే వెంకీ మామ కూడా.. తన మొదటి సినిమాలోనే పెదవి తాంబూలం అందుకున్నాడు. 1986లో కలియుగ పాండవులు సినిమాతో వెంకీ సినీ ప్రస్థానం మొదలైంది.

హీరోయిన్ ఖుష్బూకి కూడా ఇదే మొదటి సినిమా. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందింది. తెలుసు కదా.. దర్శకేంద్రుడి సినిమా అంటే రొమాన్స్ మాములుగా ఉండదు. ఇక ఈ సినిమాలోని ఓ పాటలో వెంకటేష్, ఖుష్బూలతో లిప్ లాక్ పెట్టించాడు. అంటే ఫస్ట్ సినిమాతోనే వెంకీ, ఖుష్బూలు లిప్ లాక్ కానిచ్చారు. ఈ విషయం వెంకీ, ఖుష్బూలు ఇద్దరు మర్చిపోయినా రాఘవేంద్రరావు ఓ టీవీ షోలో.. ఈ ఇద్దరి అధర చుంబనం వీడియోని ప్లే చేసి మరీ చూపించాడు. అది చూసి వెంకీ, ఖుష్బూలు ఒక్కసారి మెమోరీస్ లోకి వెళ్లి స్మైల్ ఇచ్చారు.