Begin typing your search above and press return to search.

వెంకీ ఇన్స్టా పోస్ట్ వైరల్..!

By:  Tupaki Desk   |   6 Oct 2021 1:00 PM IST
వెంకీ ఇన్స్టా పోస్ట్ వైరల్..!
X
అక్కినేని నాగచైతన్య - సమంతల విడాకులకు సంబంధించి గత నాలుగు రోజులుగా వస్తున్న ప్రతీ వార్తను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. చైతన్య - సామ్ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇద్దరూ ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేశారు. చై సామ్ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా.. విడాకులకు అసలు కారణం ఏంటనే విషయంపై ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక కథలు అల్లుతున్నారు.

చై-సామ్ విడాకుల ప్రకటనపై సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమంత - నాగ చైతన్య జంట తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించకుండా చూడాలని మీడియాతో పాటు అభిమానులను శ్రేయోభిలాషులను కోరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం పై పలు ఊహాగానాలు, రూమర్స్ షికారు చేస్తుండటం అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు దగ్గుబాటి కుటుంబానికి ఇబ్బందిగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో చైతన్య మేనమామ, దగ్గుబాటి వెంకటేష్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ కొటేషన్ వైరల్ గా మారింది.

''మనం ఏదైనా విషయంపై నోరు తెరిచి మాట్లాడే ముందు దాని గురించి కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి'' అంటూ వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే వెంకీ ఈ పోస్ట్ చేసుంటారని నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలో అయినా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వెంకటేష్.. ఇప్పుడు ఇన్స్స్టా స్టోరీలో పెట్టిన కొటేషన్.. చై- సామ్ విడాకులపై జరుగుతున్న రచ్చ పై పరోక్షంగా కౌంటర్ వేస్తున్నారని అనుకుంటున్నారు.

నాగచైతన్య - సమంత విడాకుల పై అక్కినేని ఫ్యామిలీ తరపున నాగార్జున.. మరోవైపు సామ్ తండ్రి స్పందించారు. చై సామ్ విడిపోవడం చాలా బాధాకరమైన విషయమని నాగ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. భార్యా భర్తల మధ్య జరగినవి వ్యక్తిగతమని.. ఇద్దరూ తనకు చాలా ఇష్టమని.. వారికి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని నాగార్జున పేర్కొన్నారు. సమంత తమ ఫ్యామిలీతో గడిపిన క్షణాలు మధురమైనవని ఆయన తెలిపారు.

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కుమార్తె - అల్లుడు విడిపోవడం గురించి స్పందిస్తూ.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది ఇప్పుడు వారు విడిపోవడం దురదృష్టకరమని.. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని జోసెఫ్ వివరించారు.