Begin typing your search above and press return to search.

వెంకీ మామా నీ టైమింగే వేరు

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:44 AM GMT
వెంకీ మామా నీ టైమింగే వేరు
X
స్పాంటేనియ‌స్ గా పంచ్ లు వేయ‌డం జోకులు పేల్చ‌డం అన్న‌ది అరుదైన‌ స్కిల్. అలాంటి స్కిల్ లేకుండా మ‌న హీరోలు ద‌శాబ్ధాల పాటు ఏలేయ‌డం అన్న‌ది కుద‌ర‌ని పని. మెగాస్టార్ చిరంజీవి .. విక్ట‌రీ వెంక‌టేష్.. కింగ్ నాగార్జున‌.. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లాంటి వెట‌ర‌న్ హీరోల టైమింగ్ గురించి.. స్పీచ్ లో నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న‌టికి మొన్న నాగార్జున హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ 3 ఫైన‌ల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ మెరుపుల్ని పంచుల్ని అభిమానులు ఇంకా మ‌ర్చిపోలేదు.

తాజాగా వెంకీ మామ ప్రీరిలీజ్ వేదిక‌ పైనా విక్ట‌రీ వెంక‌టేష్ స్పాంటేనియ‌స్ స్పీచ్ అంతే పంచీగా సాగింది. ఆయ‌న మాట‌ల్లో మెరుపులు కామెడీ టైమింగ్ క‌డుపుబ్బా న‌వ్వించాయి. వేదిక వ‌ద్ద జ‌నంతో పాటుగా టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్ష‌కులు మామ పంచ్ ల‌కు ప‌డి ప‌డి న‌వ్వారు.

దేవుడా మంచి దేవుడా బుడ్డ హీరోలు కూడా బాగా మాట్లాడుతున్నారు. నాకు మాట్లాడ‌డం రావ‌ట్లేదు..! అంటూ వెంకీ మార్క్ పంచ్ లు అదిరాయి. అస‌లు వెంకీ మామ రిలీజ్ డైల‌మాపై త‌న‌కు తానే పంచ్ లు వేసుకుంటూ.. త‌న అన్న‌గారిని బాబీని రిలీజ్ తేదీ చెప్ప‌మ‌ని అడ‌గ‌డం మామ స్టైల్లో అదిరిపోయింది.

ఈ వేదిక‌పై విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ - ``నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా `వెంకీమామ` చాలా స్పెష‌ల్. నా కల నిజమైంది. నేను ఎప్ప్పుడు రానా- చైతన్యలతో ప‌ని చేయాల‌నుకున్నా ఎగ్జ‌యిట‌వుతాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా ఈ సినిమా మీ కోసమే`` నంటూ ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు.

చైతన్య ఎన్నో సినిమాల్లో చూసినా ఇందులో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు. చాలా హ్యాపీగా ఉంది. రేపు ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. బాబీ ఇలాంటి ఒక మామ అల్లుళ్ళ కథతో రావడమే చాలా గొప్ప విషయం. చాలా సెన్సిబుల్ గా తీశారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చింది. బాబీ కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది.. అని అన్నారు. చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది.. అని అన్నారు. థమన్ మంచి పాటల తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మొదటి నుండి సపోర్ట్ చేసాడ‌ని తెలిపారు. వెంకీమామ ఈనెల 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.