Begin typing your search above and press return to search.

'గురు'వు గారు డిసెంబర్ లోనే..

By:  Tupaki Desk   |   13 Sep 2016 8:10 AM GMT
గురువు గారు డిసెంబర్ లోనే..
X
గోపాలా గోపాలా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. మళ్లీ ఫాంలోకి వచ్చేసి స్పీడ్ చూపిస్తున్నాడు. ఆగస్ట్ లో బాబు బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంచనాలను అందుకోలేకపోయిన వెంకీ.. ఈ ఏడాది మరో కొత్త సినిమా రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

హిందీ- తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అయిన సాలా ఖదూస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న వెంకీ.. 2016లోనే ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడని టాక్. సుధ కొంగర డైరెక్షన్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు గురు అనే టైటిల్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ ఈ మూవీలో బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండగా.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని పక్కా ప్లానింగ్ తో తక్కువ సమయంలోనే పూర్తి చేసేయనున్నారట. వెంకటేష్ మినహాయిస్తే.. దాదాపుగా ఒరిజినల్ లో చేసిన అందరినీ రీమేక్ లో నటింపచేస్తున్నారు. దీంతో క్యాస్టింగ్ విషయంలో లేట్ అయ్యే ఛాన్స్ లేదు.

జెట్ స్పీడ్ లో షూటింగ్ ఫినిష్ చేసి.. డిసెంబర్ లో గురుని విడుదల చేసేయనున్నారట. సాలా ఖదూస్ లో మాధవన్ కి శిష్యురాలిగా నటించిన రితికా సింగ్ ని 'గురు'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు వెంకీ.