Begin typing your search above and press return to search.

దీపావళి పోస్టరు అదిరింది గురూ!

By:  Tupaki Desk   |   29 Oct 2016 7:01 AM GMT
దీపావళి పోస్టరు అదిరింది గురూ!
X
గురు అనే టైటిల్ ఎంత పవర్ ఫుల్లో అందరికీ తెలిసిందే. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో మళ్లీ మరో సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్ హీరోగా రూపొందే ఈ సినిమా ఇరిధిసుట్రు అనే తమిళ సినిమా ఆధారంగా రూపొందుతుంది. అయితే హిందీ సినిమా సాలా ఖడుస్ కు ఇదే మాతృక. బాక్సింగ్ కోచ్ గా ఈ సినిమాలో వెంకటేష్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి దీపావళి శుభాకాంక్షలతో మరో పోస్టర్ విడుదలయ్యింది.

ఈ పోస్టర్ లో బైక్ పై తన శిష్యురాలిని ఎక్కించుకుని కసిగా దూసుకుపోతున్న వెంకటేష్ కనిపిస్తారు. ఈ పోస్టర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదనే చెప్పాలి. వెంకీ ఈ లుక్ లో భలేగా వున్నాడు. చాలా క్లాస్ గా - డిఫరెంట్ గా - రిచ్ లుక్ తో ఈ పోస్టర్ ని డిజైన్ చేసారు. కాగా వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌ గా నటిస్తున్న ఈ గురు సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఒక మహిళా బాక్సర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం నిర్మితమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేష్ లుక్‌ కు సంబంధించిన ఫోటోలను శనివారంనాడు మరోసారి విడుదల చేశారు.

ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా - పివిపి సంస్థ నిర్మిస్తుంది. తమిళ సినిమాలో మాధవన్ పోషించిన బాక్సింగ్ మాస్టర్ పాత్రనే తెలుగులో వెంకీ పోషిస్తున్నాడు. అందుకే గురు అన్న టైటిల్ ఏప్ట్ గా వుంటుందని ఫిక్స్ చేసారు. కాగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతికా సింగ్ నే తెలుగులో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/