Begin typing your search above and press return to search.

త్వరలో కెమెరా ముందుకు హీరో వెంకటేష్ కూతురు..!

By:  Tupaki Desk   |   8 March 2021 6:22 AM GMT
త్వరలో కెమెరా ముందుకు హీరో వెంకటేష్ కూతురు..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలందరి ఫ్యామిలీస్ నుండి కొత్తహీరోలు, హీరోయిన్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అలాగే తండ్రుల వారసత్వం నటనరంగంలో కంటిన్యూ చేయడానికి వారసులు, వారసురాళ్లు రెడీ అవుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ ఎంతటి పేరుందో అందరికి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి గ్రేట్ రామానాయుడు నిర్మాతగా ప్రస్థానం మొదలుపెడితే.. ఆ తర్వాత ఆయన కొడుకులు సురేష్, వెంకటేష్ సినిమారంగంలో వారి సత్తా చాటుకున్నారు. ఇప్పటికి ఒకరు నిర్మాతగా మరొకరు హీరోగా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే వీరి నుండి వారసత్వంగా రానా ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే వెంకటేష్ ఫ్యామిలీ నుండి మాత్రం హీరోలు, హీరోయిన్స్ ఎవరూ రాలేదు.

హీరో వెంకటేష్ మొదటి నుండి కూడా ఆయన ఫ్యామిలీ విషయాలు, ఫ్యామిలీ మెంబర్లను జనాల ముందుకు తీసుకురాలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నప్పటికీ ఏ ఒక్కరిని సినిమాల వైపు నడిపించలేదు. అయితే 2019లో వెంకటేష్ పెద్దకూతురు అశ్రీత.. వినాయక్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతో స్పెయిన్ దేశంలో వివాహబంధాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఎన్నడూ లేనివిధంగా అశ్రీత త్వరలో కెమెరా ముందుకు రాబోతుంది. యాక్ట్రెస్ గా కాదు యూట్యూబర్ గా రాబోతుంది. అశ్రీత తాజాగా 'ఇన్ఫినిటీ ప్లాట్టర్' అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా ఆమె ఫుడ్ అండ్ ట్రావెల్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోబోతుంది. అంటే ఆమెకు తెలిసిన లోకల్ వంటకాలను, అందమైన ట్రావెలింగ్ ప్లేసెస్ ను తన యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేయనుంది. చూడాలి మరి వెంకీ డాటర్ ప్రేక్షకులను అలరిస్తుందేమో!