Begin typing your search above and press return to search.

దగ్గుబాటి వారి పెళ్ళిసందడి.. లిమిటెడ్ గెస్ట్స్!

By:  Tupaki Desk   |   19 March 2019 10:39 PM IST
దగ్గుబాటి వారి పెళ్ళిసందడి.. లిమిటెడ్ గెస్ట్స్!
X
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రితకు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డిగారి మనవడికి త్వరలో వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే నిశ్చితార్థం ఘనంగా జరిగిందట. కానీ మీడియా హడావుడి లేకుండా పూర్తిగా ప్రైవేటు ఫంక్షన్ లాగా ఎంగేజ్మెంట్ ను జరిపారు. ఈ ఫంక్షన్ కు సంబంధించి ఒక్కఫోటో కూడా బయటకు రాలేదంటే ఎంత ప్రైవేట్ గా కార్యక్రమాన్ని నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఈ వారంలోనే వివాహం జరగనుందట. రాజస్థాన్ లో జరగనున్న ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు.. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశారట. ఇప్పటికే వివాహానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయట. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వ్యవహారాలన్నీ సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తుండడంతో వివరాలేవీ బైటకు పొక్కడం లేదు.

దగ్గుబాటివారి వివాహం అంటే రానా.. నాగ చైతన్య.. సమంతాల సందడి మామూలుగా ఉండదు. వారిలో ఎవరైనా పెళ్ళికి సంబంధించిన విశేషాలు వెల్లడిస్తారేమో వేచి చూడాలి. ఇదిలా ఉంటే దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్ ను మాత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ రిసెప్షన్ కు మాత్రం ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారు ఇతర ముఖ్యులు హాజరవుతారని సమాచారం.