Begin typing your search above and press return to search.

గారు వద్దు పవన్ -వెంకీ పంచ్

By:  Tupaki Desk   |   12 Jan 2018 9:27 AM GMT
గారు వద్దు పవన్ -వెంకీ పంచ్
X
అజ్ఞాతవాసి టైటిల్ కార్డ్స్ లో వెంకటేష్ కు థాంక్స్ చెప్పినప్పుడే అందరికి డౌట్ వచ్చింది. ఇందులో వెంకటేష్ ఉన్నాడు అనే వార్తలు గతంలోనే వచ్చిన నేపధ్యంలో అవి నిజమే కాబోలు అనుకుని వెంకీ ఎంట్రీ కోసం ఎదురు చూసారు. సినిమా అయిపోతున్నా ఎంతకీ వెంకీ రాకపోవడం చూసి ప్రేక్షకులు కొంత నిరుత్సాహపడ్డారు. కాని వాటిని మటుమాయం చేయడానికో లేక డివైడ్ టాక్ తో నీరసించి పోతున్న వసూళ్ళకు కాస్త బలాన్ని ఇవ్వడానికో పండగ రోజు నుంచి వెంకీ సీన్ ని కలపబోతున్నారు. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోని ఇందాకే విడుదల చేసారు. అందులో వెంకీ స్టూడియోకు రావడం, పవన్ తో పక్కనే కూర్చుని తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడం అంత సరదాసరదాగా ఉంది. అందులో వినిపించిన మాటలను బట్టి ఇదేదో సరదా సన్నివేశం అని అర్థమైపోతుంది.

పవన్ వెంకీని గురువు గారు అని సంబోధించడం, దానికి బదులుగా వెంకటేష్ గారు అక్కరలేదు అని బదులు ఇవ్వడం, గబ్బర్ సింగ్ లోని తిక్క డైలాగ్ ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం అంతా ఫన్నీగా ఉంది. దీని కోసం వెంకటేష్ ఫాన్స్, పవన్ ఫాన్స్ మరోసారి అజ్ఞాతవాసిపై లుక్ వేసే అవకాశాలు ఉన్నాయి. కాని వెంకీ ఉండేది చిన్న లెంగ్త్ రోల్ కాబట్టి అది అమాంతం పెను ప్రభావం చూపించి కలెక్షన్స్ పెంచేస్తుంది అని చెప్పలేం కాని కొంత బూస్ట్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేసి ఓపెనింగ్ పరంగా తన స్టామినా చూపించిన పవన్ ఈ నాలుగు రోజులు ఎంత రాబడతాడు అనే దాని మీద అజ్ఞాతవాసి కమర్షియల్ స్టేటస్ ఆధారపడి ఉంది. జైసింహ, గ్యాంగ్ సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతోంది అనేది కూడా ప్రభావం చూపిస్తుంది. గోపాల గోపాలలో దేవుడు, భక్తుడిగా కలిసి అలరించిన వెంకీ-పవన్ కాంబో మరోసారి చూడాలంటె పండగ రోజు అజ్ఞాతవాసి చూడాలి మరి.